నీట్ ఎగ్జామ్‌లో 6 మార్కులొచ్చాయని సూసైడ్

NEET ఎగ్జామ్‌లో ఆరు మార్కులు మాత్రమే రావడంతో షాక్ కు గురైన విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది. మధ్యప్రదేశ్ లోని చ్ఛింద్వారా జిల్లాలో ఉండే విధి సూర్యవంశీ అనే బాలిక సెప్టెంబరులో నీట్ ఎగ్జామ్ రాసింది. ఆన్‌లైన్లో రిజల్ట్స్ రాగానే.. 6మార్కులు వచ్చినట్లు తెలిసింది.
కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. 18ఏళ్ల యువతి నీట్ లో మార్కులు సాధించాలని డాక్టర్ కావాలని ప్రిపేర్ అయింది. ఈ క్రమంలో రాసిన ఎగ్జామ్ లో 6మార్కులే వచ్చాయని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లింది. ఎంట్రన్స్ టెస్టులో ఓఎమ్మార్ షీట్ ను బట్టి.. 590 మార్కులు వచ్చాయని చూపించి ఓదార్చేందుకు ప్రయత్నించారు.
అప్పటికే లేట్ అవడంతో యువతి సూసైడ్ చేసుకుని మంగళవారం చనిపోయింది. నీట్ ఫలితాల కాంట్రవర్సీలో రీసెంట్ గా సూర్యవంశీ నష్టపోయింది. అంతకంటే ముందు బీహార్ లో ఓమ్మార్ షీట్ ఆధారంగా 720కి గానూ 615వచ్చిన వికాస్ గోయెల్ మార్కుల్లో ఘోరమైన ఫలితాలు పొందడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
నీట్ ఎగ్జామ్ ఈ ఏడాది చాలా ఆటంకాలు ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో నీట్ ఎగ్జామ్ వాయిదా వేయమని అభ్యర్థులు డిమాండ్ చేసినా కంటిన్యూ చేసేశారు. కంగారుపడిన స్టూడెంట్లు ఎగ్జామ్ గురించి ఆందోళనపడి ప్రాణాలు కోల్పోయారు.