చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు ములాయం మద్దతు

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 09:35 AM IST
చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు ములాయం మద్దతు

Updated On : February 11, 2019 / 9:35 AM IST

ఢిల్లీ  : ఢిల్లీలోని ఏపీ భవన్ లో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. చంద్రబాబు దీక్షకు ములాయం సింగ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంట్లో బాగోలేకున్నా..బాబు పిలిచినందుకే దీక్షకు వచ్చానని తెలిపారు. న్యాయ పోరాటానికి తామంతా మద్దతిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు సామాన్య నాయకుడు కాదన్నారు. ఆయనకు అన్ని వర్గాల ప్రజలు వెన్నుదన్నుగా నిలుస్తారని ములాయం చెప్పారు. ఫిబ్రవరి 11 సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఉదయం 8 నుండి దీక్ష ప్రారంభించారు. రాత్రి 8గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.