నిలదీసిన బైకర్‌ను నడిరోడ్డుపై ఢీ కొట్టిన ఆటోవాలా..వీడియో వైరల్

నిలదీసిన బైకర్‌ను నడిరోడ్డుపై ఢీ కొట్టిన ఆటోవాలా..వీడియో వైరల్

Updated On : December 25, 2020 / 7:11 PM IST

Mumbai autorickshaw driver rams vehicle into bike at full speed : అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా నడుపొద్దని..ఓ ఆటోడ్రైవర్‌కు చెప్పడం బైకర్ తప్పైంది. నిర్లక్ష్యంగా..ఏమాత్రం కనికరం లేకుండా..ఆ బైక్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు ఆ ఆటోడ్రైవర్. వెనుక నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో ఆ బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని గోవాండిలో చోటు చేసుకుంది. శివాజీనగర్ – దేవ్ నార్ – బైంగాన్వాడీ మధ్యనున్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద..బైకర్, ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పుడు రెడ్ సిగ్నల్ పడింది. అనంతరం గ్రీన్ సిగ్నల్ పడడంతో ఎవరికీ వారు వెళుతున్నారు.

Mumbai

కానీ..నిలదీశాడన్న కారణంతో..ముందు వెళుతున్న బైకర్‌ను ఓవర్ టేక్ చేశాడు. అమాంతం..రైట్ టర్న్ తిప్పడం..బైకర్ ఆటోను ఢీకొని కిందపడడం జరిగిపోయాయి. ఏమి చేయనట్టుగా ఆటోడ్రైవర్ వెళ్లిపోవడం సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వెనుక నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కిందపడిన ఆ బైకర్ బిత్తరపోయి చూశాడు. ట్విట్టర్ వేదికగా పలువురు ఈ వీడియోను పోస్టు చేశారు. ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని..ఆటో నెంబర్ ఆధారంగా..దర్యాప్తు ప్రారంభించారు. రఫీక్ నగర్ కు చెందిన 34 ఏళ్ల సల్మాన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.