గణేశ్ పూజలో బార్ డ్యాన్సర్ల హల్‌చల్

గణేశ్ మండపం పూజా కార్యక్రమాల్లో డీజే పాటలు వరకూ విన్నాం కానీ, ఈ బార్ డ్యాన్సర్లతో పోగ్రాంలు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ముంబైలోని నందూర్‌బార్ రైల్వే గణపతి మండల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన సినిమా పాటలకు చిందులు వేస్తూ స్టేజిపై హల్‌చల్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కొన్నేళ్ల క్రితం వాసయ్‌లోని గణేశ్ మండప్ బార్ డ్యాన్సర్లతో డ్యాన్సింగ్ బార్‌గా మారింది. బాలీవుడ్, భోజ్‌పూరీ పాటలతో చిందులేస్తుంటే అక్కడున్న వారు మహిళలపై డబ్బుల నోట్లు విసిరేస్తూ కనిపించారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో భాగంగా ఈ బార్ డ్యాన్సర్లతో ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో కొందరు రైల్వే ఉద్యోగులు సైతం బార్ డ్యాన్సర్లతో కలిసి చిందేశారు.
కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌లోని ఓ మహిళా డ్యాన్సర్ ఇలాగే చేస్తున్న చిందులు చూసి తమతో లైంగికంగా పాల్గొనాలంటూ నలుగురు వ్యక్తులు బలవంతం చేశారు. ఈ సంవత్సరారంభంలో సుప్రీం కోర్టు హోటళ్లు, రెస్టారెంట్లు& బార్ లపై చట్టం చేసింది. బార్ డ్యాన్సర్లతో ఐదున్నర గంటలకు మించి డ్యాన్స్ చేయించకూడదని ఆంక్షలు విధించింది.