ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. మిహిర్ షా ఎవరు? అరెస్టుకు పోలీసుల తాత్సారం ఎందుకు?

ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. మిహిర్ షా ఎవరు? అరెస్టుకు పోలీసుల తాత్సారం ఎందుకు?

mumbai Bmw car hit and run case

BMW Hit and Run Case : ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున 5.30గంటల సమయంలో ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్ నుంచి భార్య కావేరీ నక్వాతో పార్థిక్ నక్వా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు వేగంగా వచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావేరీ నక్వా మరణించగా.. ఆమె భర్త పార్థిక్ నక్వాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read : Hema – Manchu Vishnu : నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది.. రేవ్ పార్టీ ఇష్యూపై మంచు విష్ణుని కలిసిన హేమ..

కారు ఢీకొట్టగానే బైక్ పైనుంచి దంపతులు ఇద్దరూ గాల్లోకి ఎగిరి కారు బానెట్ పై పడ్డారు. పార్ధిక్ నక్వా అక్కడేపడిపోగా.. కావేరిని కారు 100మీటర్లు దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలతో పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ తో పాటు మిహిర్ షా ఉన్నాడు. మిహిర్ షా తప్పించుకోగా.. డ్రైవర్ బిజావత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నాడని, అతడే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది.

Also Read : Telangana corporation chairmans : తెలంగాణలో కార్పొరేషన్ల చైర్‌ప‌ర్స‌న్ల‌ నియామకం..

మిహిర్ షా ఎవరు?
మిహిర్ షా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. మిహిర్ షా 10వ తరగతి చదివాడు. ఆ తరువాత విద్యను అభ్యసించలేదు. అతను మహారాష్ట్రలో తన తండ్రి రాజేష్ షా వ్యాపారాల్లో సహకారం అందిస్తున్నాడు. ప్రమాదానికి ముందు.. మిహిర్ మద్యం మత్తులో ఉన్నాడు. డ్రైవర్ తో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని సూచించాడు. జుహూ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పక్కకు తప్పించి మిహిర్ షానే స్వయంగా డ్రైవ్ చేశాడు. ప్రమాదం తరువాత కారును బాంద్రా కళానగర్ లో వదిలి అక్కడి నుంచి మిహిర్ షా పరారయ్యాడు. అంతకుముందు.. కారుపై ఉన్న శివసేన స్టిక్కర్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. కారున తన తండ్రి పేరుపై ఉందని తెలియకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ను సైతం తొలగించాడని పోలీసులు గుర్తించారు.

సీఎం ఏక్‌నాథ్ షిండే ఏమన్నారంటే..
వర్లీ పోలీసులు మిహిర్‌పై ర్యాష్ డ్రైవింగ్, హత్యకు సంబంధించి కేసుతోపాటు, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మిహార్ షా పారారీలో ఉండటంతో ఆరుగురు పోలీసుల బృందం అతనికోసం గాలిస్తుంది. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని, నిందితులు ఎంతటివారైనా చట్టం తనపని తాను చేస్తుందని పేర్కొన్నారు. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్ నాథ్ షిండే తెలిపారు.