Viral Video: కుర్చీని బ్యాగులో పెట్టుకుని తెచ్చుకున్న ప్రయాణికుడు.. రైల్లో సీట్లు దొరకట్లేదు మరి..
సీట్లు దొరకక నిలబడ్డవారంతా అతడి ఐడియాను చూసి ఆశ్చర్యపోయారు.

ముంబై లోకల్ ట్రైన్లలో సీటు సంపాదించుకోవాలంటే పెద్ద పోరాటం చేయాల్సిందే. మొదటి స్టాపులో ఎక్కినవారికి తప్ప ఇతర స్టేషన్లలో ఎక్కిన వారికి సీట్లు దొరకవు. జనాలతో లోకల్ ట్రైన్లు కిక్కిరిసిపోతాయి. హాయిగా సీటులో కూర్చొని ప్రయాణం చేయాలంటే అదృష్టం ఉండాలని ప్రయాణికులు భావిస్తారు.
ఇదిలా ఉండగా, ఓ వ్యక్తి ట్రైనులో కూర్చొని ప్రయాణించడానికి ఓ ఉపాయం ఆలోచించాడు. ట్రైనులో సీటు ఎలాగో దొరకదని భావించిన అతడు.. తన బ్యాగులో ప్లాస్టిక్ స్టూల్‌ని మడతపెట్టి తెచ్చుకున్నాడు. ట్రైను ఎక్కిన తర్వాత బ్యాగును తెరచి అందులోని ప్లాస్టిక్ స్టూల్‌ను తీశాడు. దాన్ని ట్రైనులో వేసుకుని కూర్చున్నాడు.
సీట్లు దొరకక నిలబడ్డవారంతా అతడి ఐడియాను చూసి ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ట్రైనులోకి స్టూల్ తెచ్చుకుని కూర్చున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఐడియాను తామూ పాటిస్తామని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరి కుర్చీని వారు తెచ్చుకుని, ఎవరి పని వారు చేసుకుంటే ప్రపంచంలో బాధలు అనేవే ఉండబోవని కొందరు హితవు పలుకుతూ కామెంట్లు చేశారు.
View this post on Instagram