భార్యా.. కూతురు పొడిచి చంపేసి అద్దం ముక్క చాతీలో గుచ్చుకుందంటూ డ్రామా..

ఓ మహిళ తన కూతురితో కలిసి భర్తను పొడిచి చంపేసి ఆ తర్వాత తనకు తానే గాయపరచుకున్నాడని అద్ధం ముక్కు విరిగి చాతీలో పొడుచుకుందని చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం జరిగితే గానీ నిజాలు బయటకు రాలేదు. ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సురేశ్ వాఘెలా అనే వ్యక్తి భార్య జాసూ, కూతురు మోనికా కలిసి అతనిపై తరచూ గొడవపడుతుండేవారు.
ఈ క్రమంలోనే అతనికి విడాకులు కూడా ఇచ్చేసింది. కొడుకు, కూతురితో కలిసి విడిగా బతుకుతుంది. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో వాఘేలా పని చేసేవాడు. జులైలో అతనికి రూ.4లక్ష విలువైన చెక్ వచ్చింది. దానిని క్యాష్ గా మార్చకుండా అలాగే ఎందుకుంచావంటూ గొడవ మొదలైంది. అతని భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అతనికి అనుమానం ఉండేది.
ఈ విషయంలోనే ఆగష్టు 27న కూతురు, భార్యతో గొడవపడ్డాడు. వాదన పెరిగి ఇద్దరూ కలిసి వాఘేలాను చితకబాదారు. కిటికీ దగ్గర కొట్టడంతో ఆ గొడవలో అద్ధం గుచ్చుకుని గాయమైందంటూ హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్ కు తీసుకెళ్లగానే మృతి చెందాడు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ కిశోర్ మానెకు తనకు తానే గాయపరచుకున్నట్లు డ్రామా కట్టారు.
ఆల్కహాల్ మత్తులో కిటికీ అద్దంతో పొడుచుకున్నాడని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం రిపోర్టులు రావడంతో అసలు నిజం తెలిసింది. ఇంటరాగేషన్లో వారిద్దరూ కలిసే నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. సెప్టెంబర్ 5వరకూ వారు పోలీస్ రిమాండ్ లోనే ఉండాలని ఆర్డర్.