Mumbai : ఉబెర్ ట్యాక్సీలో ముస్లిం డ్రైవ‌ర్ కోసం మ‌హిళ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ఉబెర్ ట్యాక్సీలో ముస్లిం డ్రైవ‌ర్ కోసం ఓ మ‌హిళ చేసిన పనికి హ్యాట్సాప్ చెబుతున్నారు నెటిజన్లు.

Mumbai : ఉబెర్ ట్యాక్సీలో ముస్లిం డ్రైవ‌ర్ కోసం మ‌హిళ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Mumbai Women Muslim Driver Azan

Updated On : April 19, 2022 / 9:42 AM IST

Mumbai Women muslim driver Azan :ముంబైకి చెందిన ప్రియాసింగ్ అనే మహిళ ముస్లిం డ్రైవర్ కోసం చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రియాసింగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉబెర్ కారును బుక్ చేసుకుంది. ప్ర‌యాణం ప్రారంభ‌మైన 10నిమిషాల త‌ర్వాత డ్రైవ‌ర్ ఫోన్‌లో అజాన్ వినిపించింది. అది విన్న ప్రియాసింగ్ అత‌డిని ‘ఇఫ్తార్ చేశారా?.. ఉప‌వాసం విడిచిపెట్టారా?’ అని ప్ర‌శ్నించింది. దానికి అత‌డు ‘అవును..డ్యూటీలో ఉన్నాను క‌దా..విడిచిపెట్టాను’ అని స‌మాధానం ఇచ్చాడు.

దాంతో ఆమె ‘న‌మాజ్ చేస్తారా?’ అని ప్ర‌శ్నించింది. డ్యూటీలో ఉన్నాను కదా మాడమ్ ఎట్లా వీలు అవుతుంది? తప్పదు కదా. అని అన్నాడు.దానికి ఆమె ఏం ఫరవాలేదు.. అనటంతో డ్రైవర్ ‘న‌మాజ్ చేసుకోవ‌చ్చా?’ అని అడిగాడు. ‘తప్పకుండా చేసుకోండి భయ్యా..కారు ఆపండి అంటూ చెప్పింది. అతను కారు ఆపగానే ఆమె కారు దిగి ‘మీరు వెనుక సీట్లో కూర్చుని నమాజ్ చేసుకోండి భయ్యా’ అంటూ తను ముందు సీటు (డ్రైవర్) లోకి వెళ్లి కూర్చుంది.

ఆ డ్రైవ‌ర్ వెనుక సీటును ప‌క్క‌కు జ‌రిపి న‌మాజ్ చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని ప్రియాసింగ్ లింక్‌డ్ ఇన్‌లో ‘భార‌తీయ‌త అంటే ఇది.. నా త‌ల్లిదండ్రుల‌కు నాకు ఇదే నేర్పించారు’ అని రాసుకొచ్చింది.