Colonel Sofiya Qureshi: మా గ్రేట్ గ్రాండ్ మదర్ రాణి లక్ష్మీ బాయితో కలిసి పోరాడింది- వైరల్ గా మారిన కల్నల్ సోఫియా ఖురేషి పాత వీడియో..

కల్నల్ సోఫియా ఖురేషి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Colonel Sofiya Qureshi: మా గ్రేట్ గ్రాండ్ మదర్ రాణి లక్ష్మీ బాయితో కలిసి పోరాడింది- వైరల్ గా మారిన కల్నల్ సోఫియా ఖురేషి పాత వీడియో..

Updated On : May 9, 2025 / 5:40 PM IST

Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా ఖురేషి.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆమె ధైర్య సాహసాలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ ఇటీవల బ్రీఫింగ్ ఇచ్చింది.

భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు భారత్ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వారిలో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషి దేశ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించారు. కల్నల్ సోఫియా ఖురేషి టాలెంట్ ను, సైన్యానికి ఆమె అందించిన విశిష్ట సేవలను అంతా కొనియాడుతున్నారు.

కల్నల్ సోఫియా ఖురేషి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మా తాతల కాలం నుంచి ఆర్మీలోనే ఉన్నాం అంటూ ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

2016లో అంతర్జాతీయ విన్యాసాలలో సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళగా సోఫియా ఖురేషి గుర్తింపు పొందారు. 2017లో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన లోతైన సైనిక వంశాన్ని వెల్లడించారు. తన ముత్తాత రాణి లక్ష్మీ బాయితో కలిసి పోరాడిందని ఆమె తెలిపారు.

Also Read: దటీజ్ ఇండియా.. ఆపరేషన్ సిందూర్‌తో గీత దాటకుండానే పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టిన భారత్..

”నేను ఫౌజీ కిడ్. ఆర్మీ ఎన్విరాన్ మెంట్ లో పెరిగాను. అంతే కాదు నా గ్రేట్ గ్రాండ్ మదర్ రాణి లక్ష్మిబాయితో కలిసి పోరాడింది. ఆమె ఉమెన్ వారియర్. మేము ఇద్దరం సిస్టర్స్. ఇద్దరిలో ఒకరు ఆర్మీలో చేరాలన్నది మా అమ్మగారి కల. అవకాశం వస్తే ఆర్మీలో జాయిన్ అవుతానని చెప్పా. అప్లయ్ చేసుకున్నా, నాకు అవకాశం వచ్చింది. నా గ్రాండ్ ఫాదర్ కూడా ఇండియన్ ఆర్మీలో పని చేశారు. అలర్ట్ గా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత. దేశం కోసం నిలబడటం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పేవారు. దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేవారు” అని సోఫియా ఖురేషి అన్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Akash Raj 🇮🇳 (@militarymantra)

గుజరాత్‌కు చెందిన సోఫియా ఖురేషి బయో కెమిస్ట్రీలో పీజీ చేశారు. పీస్‌ కీపర్‌గా ఆమెకు అపారమైన అనుభవముంది. ఐక్యరాజ్యసమితికి చెందిన పీస్‌ మిషన్‌లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. 2016లో పుణెలో జరిగిన ‘ఎక్సర్‌ సైజ్‌ 18’ పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. అందులో 18 దేశాలు పాల్గొనగా.. ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం విశేషం. 1990లలో సోఫియా ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కోర్‌కు చెందిన సీజన్డ్ ఆఫీసర్ గా చేశారు.