తాజ్‌మహల్, ఎర్రకోట లేకపోయుంటే ఆవు పేడను చూపించేవాళ్లా !!

మోడీ ప్రభుత్వం కారణంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రతిపక్షాల విమర్శలు చేస్తూనే ఉన్నాయి. సుమారు పదేళ్ల వయస్సున్న పిల్లాడు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఇంక్విలాబ్ నినాదాలు చేస్తుంటే సభ హర్షాతిరేకాలతో ఊగిపోయింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభలో హై వోల్టేజ్ స్పీచ్‌తో అందరి కళ్లూ తనవైపుకు తిప్పుకున్నాడు.
తాజ్‌మహల్, ఎర్రకోట లేకపోయుంటే ప్రపంచానికి ఆవును.. ఆవు పేడను చూపించేవాళ్లా అంటూ ప్రశ్నించాడు. మొగల్ చక్రవర్తుల కట్టడాలను చూపించి కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. నరేంద్ర మోడీ ముర్దాబాద్. రాజ్యాంగాన్ని కాపాడండి’ అంటూ నినాదాలు చేస్తూ.. ర్యాలీలో జోష్ రెట్టింపు చేశాడు.
ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కన్హయ్య కుమార్ బీహార్ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నాడు. నర్మదా బచావో ఆందోళనలో పాల్గొన్న మేధా పాట్కర్, మహాత్మగాంధీ మనువడు తుషార్ గాంధీ, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కణ్నన్ గోపీనాథన్‌లు ఈ సభలో పాల్గొన్నారు.
సభ ముగిసిన తర్వాత జాతీయ గీతం పాడింది కన్హయ్య కుమార్ గ్యాంగ్. పాడుతున్నప్పుడు కొన్ని పదాలు ఎగరకొట్టాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ కు గురవుతున్నాడు కన్హయ్య.
See Also | చెట్లు నరికినందుకు రూ. 53వేలు జరిమానా
देखेंः कन्हैया कुमार की ‘संविधान बचाओ रैली’ में इस लड़के का भाषण ‘ताज और लालकिला न होता तो गोबर दिखाते।’ pic.twitter.com/3HLzeHxtSH
— NBT Hindi News (@NavbharatTimes) February 28, 2020