Rajma Chawal: రాజ్మా చావల్ తిని, కోక్ తాగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

రాత్రి పూట దొంగలు చేసే దోపిడీకి శిక్షలు ఉంటున్నాయి కానీ, ఇలా పట్టపగలు చేసేవారికి శిక్షలు ఉండవా?

Rajma Chawal: రాజ్మా చావల్ తిని, కోక్ తాగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Rajma Chawal

Updated On : January 1, 2024 / 7:36 PM IST

నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తాజాగా ఓ విమానాశ్రయంలో రాజ్మా చావల్ తిని, కోక్ తాగాడు. బిల్లు రూ.100లోపే అడుగుతారని అనుకున్న ఆ వ్యక్తికి సిబ్బంది ఇచ్చారు. ఆ బిల్లు చూసిన కస్టమర్‌కు దిమ్మతిరిగిపోయింది. బిల్లు రూ.500గా ఉంది.

ఇది పట్టపగలు చేస్తున్న దోపిడీ అంటూ ఆ కస్టమర్ సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా విమానంలో ప్రయాణించడానికి వస్తున్నారంటే వారిని దోచుకోవచ్చని అర్థమా? అని నిలదీశాడు. ఏ ఎయిర్‌పోర్టులో తనకు ఈ అనుభవం ఎదురైందన్న విషయాన్ని ఆ ప్రయాణికుడు చెప్పలేదు.

ఆ ప్రయాణికుడికి ఎదురైన అనుభవం వంటిదే తమకూ ఎదురైందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా అధికంగా బిల్లు వసూలు చేసే వారిపై కేసులు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట దొంగలు చేసే దోపిడీకి శిక్షలు ఉంటున్నాయి కానీ, ఇలా పట్టపగలు చేసేవారికి శిక్షలు ఉండవా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఇటువంటి ఘటనలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Zomato CEO : పార్టీ చేసుకోకుండా పండుగ రోజు పనేంటి భయ్యా.. పైగా ‘వార్ రూమ్’ కలరింగ్.. జొమాటో సీఈఓను ఏకిపారేసిన నెటిజన్లు..!