Narendra Modi: 3 దేశాల్లో పర్యటించి ఢిల్లీ చేరుకున్న మోదీకి ఘనస్వాగతం.. వీడియో

విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Narendra Modi: 3 దేశాల్లో పర్యటించి ఢిల్లీ చేరుకున్న మోదీకి ఘనస్వాగతం.. వీడియో

Narendra Modi

Updated On : May 25, 2023 / 9:11 AM IST

PM Modi: జపాన్ (Japan), పాపువా న్యూ గినియా (Papua New Guinea), ఆస్ట్రేలియా(Australia)లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ఇవాళ భారత్ చేరుకున్నారు. మోదీ జీ 7 సదస్సుతో పాటు ఆ మూడు దేశాలతో ధ్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇవాళ న్యూ ఢిల్లీ (New Delhi)లోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర మాజీ మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఎంపీ రమేశ్ విధురి, స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

మోదీ భారత్ కోసం విదేశీ పర్యటనలు చేస్తూ శ్రమిస్తున్నారని బీజేపీ నేతలు అన్నారు. తనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆస్ట్రేటియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తో మోదీ బుధవారం సమావేశమయ్యారు. ఆస్ట్రేలియాలో పలువురు పారిశ్రామికవేత్తలను కూడా కలిశారు.

అంతకుముందు పాపువా న్యూ గినియాలో ఇండియా-పసిఫిక్ దీవుల సహకార (FIPIC) సదస్సులో మోదీ పాల్గొన్నారు. మోదీ ఇవాళ ఉత్తరాఖండ్ లో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది.

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్లలో మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారో తెలుసా? ఆ ఏడాది మాత్రం ఒక్క విదేశీ పర్యటనకూ వెళ్లలేదు..