Jupiter: సౌర వ్యవస్థలోని అతిపెద్ద గ్రహ ఫొటోలు విడుదల.. అత్యద్భుతం

దీనిపై పరిశోధనల కోసం అట్లాస్ వీ 551 (ఏవీ-029) రాకెట్‌ ద్వారా జ్యునో ప్రయోగాన్ని 2011 ఆగస్టు 5న..

Jupiter: సౌర వ్యవస్థలోని అతిపెద్ద గ్రహ ఫొటోలు విడుదల.. అత్యద్భుతం

Jupiter

Jupiter – Images: సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం బృహస్పతికి సంబంధించిన రెండు ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. భూమి పరిమాణం కంటే బృహస్పతి పరిమాణం 1303 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బృహస్పతిని గురు గ్రహం అని కూడా అంటాం.

దీనిపై పరిశోధనల కోసం అట్లాస్ వీ 551 (ఏవీ-029) రాకెట్‌ ద్వారా జ్యునో ప్రయోగాన్ని 2011 ఆగస్టు 5న చేసింది. ఇది సౌరశక్తితో పనిచేసే నాసా వ్యోమనౌక. దాదాపు ఐదేళ్ల తర్వాత అది 2016, జులై 5న అది గురు గ్రహ ధ్రువ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఏడాది అక్టోబరు 9న అత్యంత సమీపంలోకి వెళ్లనుంది.

Jupiter

తాజాగా, గురు గ్రహానికి చెందిన రెండు ఫొటోలను నాసా పోస్ట్ చేస్తూ పలు వివరాలు తెలిపింది. గురు గ్రహంలో అత్యంత శక్తిమంతమైన తుపానులు ఇందులో కనపడ్డాయి. వాటర్‌కలర్ పెయింటింగ్‌ను పోలి గురుగ్రహం ఉన్నట్లు ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రాలను వ్యోమనౌక.. ప్లానెట్ క్లౌడ్ టాప్ కి దాదాపు 23,500 కిలోమీటర్ల ఎత్తులో నుంచి తీసింది. 2019 జులైలో వ్యోమనౌక గురు గ్రహ 24వ ఫ్లైబై పూర్తి చేసుకున్న సమయంలో తీసిందని నాసా వివరించింది. అంతరిక్ష వాహక నౌక గురిడి సమీపంలో వెళ్తుంది. అక్కడి నుంచే గురుడిపై ఉన్న పరిస్థితులను పసిగడుతుంది. తెలుపు, నీలి రంగు చాయలతో గురుడిపై తుపాను ఆనవాళ్లు కనపడ్డాయి.

Jupiter

ఉంగరాల జుట్టు మాదిరి ఆకారంలో వేగంగా సుడులు తిరుగున్నట్లు అవి ఉన్నాయి. బుద్ధిని భ్రమింపజేసేలా ఫొటోలు ఉన్నాయని, అనంత విశ్వంలో మనకు తెలియని రహస్యాలు అనంతంగానే ఉన్నాయని నాసా పోస్టుకు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇస్రో చంద్రయాన్-3 కూడా కొన్ని రోజులుగా జాబిల్లికి సంబంధించిన ఫొటోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Chandrayaan 3: జాబిల్లిపై అటు చైనా రోవర్ కదలికలు.. ఇటు భారత రోవర్.. ఏం జరుగుతోంది?