దేశానికి ఒకటే భాష ఉండాలి..అది హిందీ అయి ఉండాలి : అమిత్ షా 

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 06:20 AM IST
దేశానికి ఒకటే భాష ఉండాలి..అది హిందీ అయి ఉండాలి : అమిత్ షా 

Updated On : September 14, 2019 / 6:20 AM IST

సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం. హిందీ దివాస్ 2019 సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన  ట్వీట్ లో దేశ‌మంతా ఒకే భాష ఉండాల‌న్న ఉద్దేశాన్ని తెలిపారు. దేశమంతా ఒకే భాష ఉండాలనీ..అది హిందీ భాష అయి ఉండాలన్నారు. దేశాన్ని ఏకం చేసే సామర్ధ్యం ఉన్న భాష హిందీ అని అన్నారు.

హిందీని దేశ‌భాష‌గా గుర్తించాల‌ని ఆయ‌న షా అభిప్రాయపడ్డారు. భార‌త దేశంలో ఎన్నో భాష‌లు ఉన్నాయ‌ని.. ప్ర‌తి భాషాకూ ప్ర‌త్యేక‌త ఉంద‌న్న ఆయన దేశ ప్ర‌జ‌ల కోసం ఒకే భాష ఉండాల‌ని..అదే భారతదేశానికి..మనకు గుర్తింపుగా మారాల‌ని షా తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఒకే భాష అవ‌స‌రమన్న షా..దేశంలోని ప్రజలు ఎక్క‌ువ సంఖ్య‌లో హిందీలోనే మాట్లాడుతున్నార‌న్నారు.

ఆయా రాష్ట్రాల ప్రజలు తమ మాతృభాష‌ను మాట్లాడుతూనే …హిందీ భాష‌ను కూడా ఎక్కువగా మాట్లాడాలని సూచించారు. దేశం మొత్తం ఒకే భాష ఉండాల‌న్న గాంధీజీ, సర్ధార్ వల్లభాయ్ ప‌టేల్ ఆశ‌యాల‌ను నెర‌వేర్చాల‌ని పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగ సభ హిందీని భారతదేశానికి అధికారిక భాషగా స్వీకరించిన రోజు చాలా ప్రాముఖ్యమైనది..అది హిందీ భాష ప్రాముఖ్యతను సూచిస్తోందన్నారు.  దేవనాగరి లిపి నుంచి  వచ్చిన హిందీ భాష దేశంలోని 22 షెడ్యూల్ భాషలలో ఒకటని షా తెలిపారు.