Corona Cases : దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు 416 మంది మృతి

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటలలో కొత్తగా 39,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కరోనా కేసుల వివరాలు పేర్కొంది. ఇక ఆదివారం కరోనా కారణంగా 416 మంది మృతి చెందినట్లుగా తెలిపారు.

Corona Cases : దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు 416 మంది మృతి

Corona Cases (4)

Updated On : July 26, 2021 / 11:35 AM IST

Corona Cases : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటలలో కొత్తగా 39,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కరోనా కేసుల వివరాలు పేర్కొంది. ఇక ఆదివారం కరోనా కారణంగా 416 మంది మృతి చెందినట్లుగా తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,20,967కు పెరిగింది.

అదే విధంగా గడిచిన ఒక్కరోజులో 35,968 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,05,79,106 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో​ 4,11,189 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 43.51 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 3 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక అత్యధిక యాక్టీవ్ ఉన్నాయి. కేరళ కొత్త వేరియంట్ కేసులు అధికంగా వస్తున్నాయి.