Assembly Elections 2023: ఎన్నికలకు రావొద్దని బెదిరించిన నక్సలైట్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పోలింగ్ సిబ్బంది

బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్‌లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు

Assembly Elections 2023: ఎన్నికలకు రావొద్దని బెదిరించిన నక్సలైట్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పోలింగ్ సిబ్బంది

Naxals Warn Election Officials: హిందీలో వచ్చిన న్యూటన్ అనే చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరో ఒక పోలింగ్ ఆఫీసర్. నక్సలైట్ ప్రాంతంలో పోలింగ్ నిర్వహణకు వెళ్లి.. నక్సలైట్ల బెదిరింపులను పట్టించుకోకుండా, వారి దాడుల్ని సైతం ఎదుర్కొని చివరి ఓటు కూడా వేయించుకుని వస్తాడు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ఎంత కష్టంగా తెలియజేసే సినిమా అది. అయితే న్యూటన్ సినిమాలోని హీరోలాంటి వారు నిజజీవితంలో కూడా ఉన్నారు. తాజాగా ఛత్తీస్‭గఢ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఘటనే ఇందుకు కారణం.

బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్‌లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు. ఇది కేవలం పోలింగ్ సిబ్బంది మాత్రమే కాకుండా.. అభ్యర్థులు, భద్రతా సిబ్బందికి కూడా వర్తిస్తుందని వారు తెలిపారు. అయితే నక్సలైట్లకు పోలింగ్ సిబ్బంది ఘాటైన సమాధానం ఇస్తూ ఫేస్‌బుక్‌, సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ‘‘రేపు వెళ్లాలి.. ఏం జరిగినా సరే వెళ్దాం’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది మాట్లాడుతూ.. తాము నిస్సహాయులమని, పరిపాలన ముందు తలవంచుతున్నామని, ఏమీ చేయలేమని అన్నారు. అయినప్పటికీ తాము తమ విధులు నిర్వహించేందుకే మొగ్గు చూపారు. తమకు ఏమైనా జరిగితే తమ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, గెలుపొందే అభ్యర్థులను కోరారు. తమ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు వారిపై మానవతా దృక్పథాన్ని చూపించాలని వారు కోరారు. తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తాము పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రంలో నవంబర్ 7, నవంబర్ 17న రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 3న విడుదల అవుతాయి.