బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం

NDA WINS BIHAR ELECTION హోరాహోరీగా జరిగిన బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..125స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు పాలించిన నితీశ్‌కుమార్.. మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
ఇక ఓట్ల శాతం విషయానికొస్తే,ఎన్డీయే కూటమికి 38.4శాతం ఓట్లు రాగా,మహాకూటమికి 37.3శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీకి 5.6శాతం ఓట్లు,ఇతరులకు 18.7శాతం ఓట్లు వచ్చాయి.ఎన్డీయే కూటమికి 38.4శాతం ఓట్లు రాగా,మహాకూటమికి 37.3శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీకి 5.6శాతం ఓట్లు,ఇతరులకు 18.7శాతం ఓట్లు వచ్చాయి.
విపక్ష పార్టీల కూటమి మహాఘట్ బంధన్ కూడా చివరివరకు ఎన్డీయేకి గట్టి పోటీనే ఇచ్చింది. 110స్థానాల్లో మహాకూటమి విజయం సాధించింది. ముఖ్యంగా తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ..ఎన్డీయేతో హోరాహోరీగా తలపడింది. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ… ఆర్జేడీని తేజస్వీ నడిపించిన తీరును ప్రజలు ప్రశంసించారు. ఓటమికి అడుగు దూరంలో నిలిచినప్పటికీ.. బిహార్ ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
జేడీయూను అధిగమించి బిహార్ ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మేలన్న ప్రచారాలు, ఎల్జేపీ ఓట్లు చీల్చడం బీజేపీకి కలిసొచ్చాయి. సాధారణంగా బీహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మధ్యే పోటీ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ తన స్థానాన్ని బలపరుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తితో పాటు జేపీ నడ్డా ప్రణాళికలతో మెరుగైన ఫలితాలు రాబట్టింది. జేడీయూ, విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీని తోసిరాజని భారీ విజయాన్ని అందుకుంది.
వాస్తవానికి గత ఎన్నికల్లోనూ బీజేపీకి వచ్చినన్ని ఓట్లు మరే పార్టీకీ రాలేదు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. ఆర్జేడీ 80, జేడీయూ 70 స్థానాలు గెలిచాయి. 53 సీట్లు దక్కించుకొని బీజేపీ ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచింది. అయితే మొత్తం ఓట్లలో ఎక్కువ భాగం బీజేపీకే దక్కాయి. 24.4 శాతం ఓట్లతో బీజేపీ తొలిస్థానంలో నిలవగా, ఆర్జేడీ 18.4శాతం, జేడీయూ 16.8శాతం తర్వాతి స్థానంలో నిలిచాయి.
ఆ తర్వాత జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయి.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీకి మరింత ఉత్సాహం లభించింది. రాష్ట్రంలో పార్టీని స్థిరీకరించేందుకు కమలదళం కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందుండి నడిపించగా.. అపర చాణక్యుడు అమిత్ షా తెరవెనక వ్యూహాలతో కీలక పాత్ర పోషించారు. అధిష్ఠానం అండతో కార్యకర్తలు చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో బూత్ స్థాయిలో పార్టీ బలపడింది.