NEET 2022: “బ్రా టేబుల్ మీద పెట్టు” ఎగ్జామ్ హాల్‌లో అరాచకంపై విద్యార్థి ఆవేదన
కేరళలోని కొల్లామ్ జిల్లాలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రంలో జరిగిన అవమానాలను ఆవేదన రూపంలో వెల్లదీస్తున్నారు. లోదుస్తులను తొలగించి పరీక్ష రాయాలని ఆదేశించి.. బలవంతంగా బ్రా విప్పించారు. నీట్ 2022 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పకడ్బందీగా..

Neet
NEET 2022: కేరళలోని కొల్లామ్ జిల్లాలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రంలో జరిగిన అవమానాలను ఆవేదన రూపంలో వెల్లదీస్తున్నారు. లోదుస్తులను తొలగించి పరీక్ష రాయాలని ఆదేశించి.. బలవంతంగా బ్రా విప్పించారు. నీట్ 2022 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించాలని వేరే ఏ రకమైన మెటేరియల్ లోపలికి తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాలనుకున్నారు. అది కాస్త శ్రుతి మించి బ్రాలు తొలగించి టేబుల్ మీద పెట్టమనేంత వరకూ వెళ్లింది.
“పరీక్షకు వెళ్లేముందు స్క్రీనింగ్ సమయంలో విద్యార్థులు బ్రాను తీసి టేబుల్ మీద పెట్టమని చెప్పారు. అలాగే చేశాం. వాటన్నిటినీ ఒక చోట పెట్టారు. పరీక్ష ముగిశాక లో దుస్తులు లేకుండానే బయటకు ఎలా వెళ్లాలేమోననే ఆందోళన మొదలైంది. పరీక్షా కేంద్రంలో అలా కూర్చోవడం కాస్త ఇబ్బందిగా అనిపించడంతో జుట్టు ముందుకు వేసుకుని కూర్చొని రాయగలిగాం”
“పరీక్ష ముగించుకుని వెళ్లేటప్పుడు బ్రాను చేతిలో పట్టుకుని వెళ్లమని చెప్పారు. అది విని చాలా సిగ్గుగా అనిపించింది. చీకటిగా ఉండటంతో మార్చుకోవడానికి వేరే స్థలమేమీ కనిపించలేదు. ఎగ్జామ్ రాయడానికి అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వచ్చారు. అందరి ముందు ఇలా కూర్చోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది”
Read Also: నీట్ విద్యార్థుల బుర్ఖా తీయించిన కళాశాల యాజమాన్యం
ఇదంతా నీట్ ఎగ్జామ్ రాసేందుకు కొల్లాం జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలోని విద్యార్థిని ఆవేదన. తన జీవితంలో మరిచిపోలేని భయానక అనుభవమని ఆమె వెల్లడించింది. మరొక విద్యార్థిని పరీక్ష ముగిశాక ఇంటికి అలాగే వెళ్లడానికి ఇబ్బందిపడి తన తల్లి శాలువా కప్పుకుందని, తన కూతురికి ఘోరమైన అవమానం జరిగిందని ఓ తండ్రి వాపోయాడు.