Lord Rama on watermelon : పుచ్చకాయపై శ్రీరాముడు.. అదిరిపోయిన చెఫ్ ఆర్ట్ వర్క్
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా రిలీజ్ అయ్యాక రామాయణం చాలామందిలో ప్రేరణ కలిగిస్తోంది. చెఫ్ అంకిత్ బగియాల్ పుచ్చకాయపై శ్రీరాముని అద్భుతమైన చిత్రాన్ని చెక్కారు. ఇంటర్నెట్‌లో పుచ్చకాయపై లార్డ్ శ్రీరామ చిత్రం వైరల్ అవుతోంది.

Lord Rama on watermelon
Lord Rama on watermelon : చెఫ్‌లు వంటలు అద్భుతంగా తయారు చేయడమే కాదు.. రకరకాల వెజిటబుల్స్‌తో కళాఖండాలను రూపొందిస్తుంటారు. వంటకాలకు మధ్యలో వాటిని అలంకరణగా పెడుతుంటారు. తాజాగా చెఫ్ అంకిత్ బగియాల్ రామాయణం నుంచి ప్రేరణ పొంది పుచ్చకాయపై శ్రీరాముని కళాఖండాన్ని అద్భుతంగా రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Women’s Creativity : ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఉన్నది గట్టు కాదా ? మహిళల క్రియేటివిటీ అదుర్స్
ఫుడ్ లవర్స్‌ను అట్రాక్ట్ చేయడం కోసం చెఫ్‌లు వంటకాలను అద్భుతంగా తయారు చేయడమే కాదు.. తయారు చేసే వాటిలో క్రియేటివిటీని కూడా చూపిస్తుంటారు. రకరకాల వెజిటబుల్స్‌తో తయారు చేసిన కళాఖండాలను వంటకాలకు మధ్యలో అలంకరణ చేస్తుంటారు. అటు వంటతో పాటు ఇటు ఆర్ట్ వర్క్‌లో కూడా చెఫ్‌లు నైపుణ్యం ప్రదర్శిస్తుంటారు. చెఫ్ అంకిత్ బగియాల్ తన పాక శాస్త్ర ప్రావీణ్యంతో పాటు కళాఖండాలను రూపొందిస్తూ అందరి మనసులు దోచుకుంటున్నాడు. తాజాగా అతను పుచ్చకాయపై శ్రీరాముని చిత్రాన్ని ఎంతో అద్భుతంగా చెక్కి అందరి మన్ననలు పొందారు. అంకిత్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో (ankitbagiyal) షేర్ చేసిన పుచ్చకాయపై లార్డ్ రామా వీడియో వైరల్‌గా మారింది.
మైక్రో ఆర్ట్ : బియ్యపు గింజలపై భగవద్గీత శ్లోకాలు చెక్కిన హైదరాబాద్ అమ్మాయి
నెటిజన్లు లవ్ ఎమోజీలతో పాటు ‘జై శ్రీరామ్’ అంటూ స్పందించారు. అంకిత్ బగియాల్ ఇన్‌క్రెడిబుల్ ఆర్ట్‌వర్క్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
View this post on Instagram