Flying Deer: అమాంతం గాల్లోకి ఎగిరిన జింక అబ్బురపరిచే దృశ్యం

ఒక జింక ఏకంగా పది అడుగుల మేర గాల్లోకి ఎగిరిన దృశ్యం ఇప్పుడు అందరిని అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోని 76 వేల మంది వీక్షించారు

Flying Deer: అమాంతం గాల్లోకి ఎగిరిన జింక అబ్బురపరిచే దృశ్యం

Flying Deer

Updated On : January 18, 2022 / 8:32 AM IST

Flying Deer: కొద్ది కొద్దిగా గెంతుతూ ఉండే జంతువులను మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఏదైనా అవాంతరాలు ఎదురైనప్పుడు, బెదిరినప్పుడు జంతువులు గెంతుతుంటాయి. అయితే ఒక జింక ఏకంగా పది అడుగుల మేర గాల్లోకి ఎగిరిన దృశ్యం ఇప్పుడు అందరిని అబ్బురపరుస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న “వైల్డ్ లెన్స్” అనే ఎన్జీవో.. తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చెరువు గట్టు వద్ద నీరు త్రాగేందుకు వచ్చిన ఒక జింక.. అక్కడున్న కొందరు మనుషులను చూసి బెదిరిపోయింది. తిరిగి తన సమూహంలో కలిసేందుకు గట్టు ఆవలికి పరుగుతీసింది.

Also read: Temple Thieves: పళని దేవాలయానికి చెందిన 400 ఏళ్ల నాటి బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం

సుమారు 10 అడుగుల ఎత్తున చెరువు గట్టు వద్దకు రాగానే జింక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. అనంతరం క్షేమంగా గట్టు ఆవలికి దూకి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే జింక అమాంతం గాల్లోకి ఎగురుతున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీశారు. ముందు రెండు కాళ్లతో ఆకాశంలోకి ఎగబాకుతున్నట్లు జింక గాల్లో ఎగిరినతీరు అబ్బురపరిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోని 76 వేల మంది వీక్షించగా 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Also read: Teachers Issues: 317 జీఓ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసనలు, అరెస్ట్