Crime News: 2 నెలల క్రితమే పెళ్లి.. వేరే అమ్మాయితో భర్త ఫోనులో మాట్లాడుతున్నాడని యువతి..

తన భర్త తీరు బాగోలేదని, ఆయనకు మరో అమ్మాయితో సంబంధం ఉందని రేష్మా అనుమానిస్తోంది. ఓ అమ్మాయితో..

Crime News: 2 నెలల క్రితమే పెళ్లి.. వేరే అమ్మాయితో భర్త ఫోనులో మాట్లాడుతున్నాడని యువతి..

Reshma

Crime News – Thiruvananthapuram: వేరే అమ్మాయితో తన భర్త ఫోనులో మాట్లాడుతున్నాడన్న అనుమానం ఓ యువతి ప్రాణాలు తీసింది. కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురంలోని అరువిక్కరలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రేష్మా (23) అనే యువతికి ఇటీవలే అక్షయ్ రాజ్ అనే యువకుడితో పెళ్లి జరిగింది.

తన భర్త తీరు బాగోలేదని, ఆయనకు మరో అమ్మాయితో సంబంధం ఉందని రేష్మా అనుమానిస్తోంది. ఓ అమ్మాయితో తన భర్త అక్షయ్ ఫోనులో మాట్లాడుతున్నాడని భావించింది. దీంతో రేష్మా కుంగుబాటుకి గురైంది. ఇవాళ తెల్లవారు జామున 3 గంటలకు ఇంట్లో పడకగదిలో సీలింగ్ ఫ్యాన్స్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆ సమయంలో ఇంట్లో అక్షయ్ లేడు. ఉదయం దాదాపు 7 గంటలకు అక్షయ్ కుటుంబ సభ్యులు రేష్మా మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఏడాది జూన్ 12న అక్షయ్, రేష్మాకు వివాహం జరిగింది. రేష్మా మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రేష్మా మృతిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Chandrayaan 3: చంద్రుడిపై మాకు ఆ హక్కు ఉంది.. ఇతర దేశాలూ పేర్లు పెట్టుకున్నాయి: ఇస్రో ఛైర్మన్