ఉగ్రవాదాన్ని ఉరికించి కొడతాం…JKLF చీఫ్ అరెస్ట్
జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF)చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు వేర్పాటువాద నేతలు అరెస్ట్ అయ్యారు. యాసిన్ మాలిక్ ను కస్టడీ ఇంటరాగేషన్ కోసం దర్యాప్తు సంస్థ కోరడంతో జమ్మూలోని పత్రేక ఎన్ఐఏ కోర్టు దానికి అనుమతినివ్వడంతో మంగళవారం (ఏప్రిల్-10,2019) సాయంత్రం యాసిన్ ను అధికారులు ఢిల్లీలోని తీహార్ జైలుకి తరలించారు.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు
ఈ ఏడాది ఫిబ్రవరిలో మాలిక్ ను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్న జమ్మూకశ్మీర్ పోలీసులు అతడిని జమ్మూలోకి కొట్ బల్వాల్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే.యాంటి టెర్రర్ లా సెక్షన్-3ప్రకారం మాలిక్ కు చెందిన జేకేఎల్ఎఫ్ పై మార్చి-22,2019న ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.
యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ పై ఇప్పటికే అనేక సీరియస్ కేసులు నమోదయ్యాయి. నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హత్య,వీపీ సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మహమద్ సయీద్ కూతురు డాక్టర్ రుబియా సయీద్ కిడ్నాప్ లో ఈ సంస్థ పాత్ర ఉంది.ఉగ్రవాదులకు JKLF ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తేలింది.
కాశ్మీర్ లోయలో పోలీసులపై రాళ్లు విసరేవాళ్లకు, వేర్పాటువాదులకు ఈ సంస్థ ఆర్థికసహకారం అందించేది.ఈ సంస్థ కార్యక్రమాలు దేశ భధ్రతకు తీవ్ర ముప్పుగా ఏర్పడటంతో JKLFని ప్రభుత్వం బ్యాన్ చేసింది.పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి