Gangsters : నార్త్ ఇండియా జైళ్లలోని గ్యాంగ్‌స్టర్లను అండమాన్‌ జైలుకు తరలించాలని ఎంహెచ్ఏను కోరిన ఎన్ఐఏ.. ఎందుకంటే?

ఉత్తర భారతదేశంలోని జైళ్లలో ఉన్న 10 నుంచి 12 మంది గ్యాంగ్‌స్టర్లను అండమాన్ నికోబార్ దీవుల జైలుకు తరలించాలని కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ లేఖ రాసింది.

Gangsters : నార్త్ ఇండియా జైళ్లలోని గ్యాంగ్‌స్టర్లను అండమాన్‌ జైలుకు తరలించాలని ఎంహెచ్ఏను కోరిన ఎన్ఐఏ.. ఎందుకంటే?

Cellular Jail

Updated On : July 2, 2023 / 10:45 AM IST

Andaman Cellular Jail : ఉత్తర భారతదేశంలోని జైళ్లలో ఉన్న 10 నుంచి 12 మంది గ్యాంగ్‌స్లర్టను అండమాన్ నికోబార్ దీవుల జైలుకు తరలించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)కు కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) లేఖ రాసింది. కొంతమంది గ్యాంగ్‌స్టర్లను అస్సాంలోని దిబ్రూగడ్ సెంట్రల్ జైలుకు పంపే ఎంపికను కూడా ఎన్ఐఏ పరిశీలిస్తోంది. అయితే, ఈ అంశాలపై ఎన్ఐఏ అధికారులు, కేంద్ర హోంశాఖ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అండమాన్ జైలులో శిక్ష కఠినంగా ఉంటుంది. బయటి నుంచి ఖైదీలు రహస్య కాంట్రాక్ట్ పెట్టుకొనే అవకాశాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా జైళ్లలో ఉన్న గ్యాంగ్‌స్టర్లను అండమాన్ జైలుకు పంపాలని ఎన్ఐఏ కోరుకుంటుంది. ఇక్కడి జైళ్లలో ఉన్న గ్యాంగ్‌స్టర్లు తమ నెట్‌వర్క్‌ను జైళ్ల నుంచే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారి నెట్‌వర్క్‌కు చెక్ పెట్టాలంటే ఇక్కడి జైళ్లనుంచి తరలించాలని ఎన్ఐఏ భావిస్తోంది.

Samul Prasad : రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో రోజుకో మలుపు

నివేదిక ప్రకారం.. వారిస్ పంజాబ్ డి ప్రముఖ్ అమృతపాల్ సింగ్, అగతని సహచరులు ప్రస్తుతం ఉన్న అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు కొంత మంది గ్యాంగ్‌స్టర్లను పంపే ఎంపికను కూడా ఎన్ఐఏ పరిశీలిస్తోంది. అమృతపాల్ పంజాబ్‌లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గతంలోకూడా ఎంహెచ్ఏకి రాసిన లేఖలో ఉత్తర భారతదేశంలోని జైళ్లలో ఉన్న కనీసం 25 మంది గ్యాంగ్ స్టర్లను దక్షిణాది రాష్ట్రాలకు బదిలీ చేయాలని ఎన్ఐఏ కోరింది. ఈ జాబితాలో పంజాబీ గాయకుడు సిధ్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ కూడా ఉన్నారు.
Temple, Dargah Demolished : ఢిల్లీలో భారీ బందోబస్తు మధ్య దేవాలయం, దర్గా కూల్చివేత

గ్యాంగ్ స్టర్లను దక్షిణ భారతదేశంలోని జైళ్లకు తరలించాలనేది ప్రాథమిక ప్రతిపాదన అని, అయితే రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున ఇది సుదీర్ఘ ప్రక్రియ అని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ అటువంటి పరిస్థితిలో ఈ గ్యాంగ్ స్టర్లను అక్కడికి తరలించడానికి కేంద్రం ఎవరి నుండి విడిగా అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని అన్నారు. అండమాన్ జైలును కాలాపాని అనికూడా పిలుస్తారు.