Nigerian Man: కత్తితో దాడి చేసిన నైజీరియన్ వ్యక్తి, 8మంది..

దక్షిణ ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ పాదచారులపై విచ్ఛలవిడిగా చెలరేగిపోయాడు. ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పార్సీవెల్ సమీపంలోని టాటా గార్డెన్‌లో జాన్ అనే 50ఏళ్ల నైజీరియన్ వ్యక్తి మహిళతో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా లేచి దాడికి పాల్పడ్డాడు.

Nigerian Man: కత్తితో దాడి చేసిన నైజీరియన్ వ్యక్తి, 8మంది..

Knife Attack

Updated On : June 2, 2022 / 2:43 PM IST

Nigerian Man: దక్షిణ ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ పాదచారులపై విచ్ఛలవిడిగా చెలరేగిపోయాడు. ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పార్సీవెల్ సమీపంలోని టాటా గార్డెన్‌లో జాన్ అనే 50ఏళ్ల నైజీరియన్ వ్యక్తి మహిళతో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా లేచి దాడికి పాల్పడ్డాడు.

కత్తిని బయటకు తీసి దాడి చేయడంతో కనీసం ఏడెనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ముంబై అడిషనల్ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ఘటనాస్థలంలో రోడ్లపై రక్తపు మరకలు రికాక్డ్ అయిన వీడియోలో కనిపించింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

Read Also: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు