Tamil Nadu :బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. అరియలూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు....

Explosion
Tamil Nadu : తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. అరియలూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన విరగలూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఫైర్ అండ్ రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన 8 మందిని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం అరియలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Also Read :Telangana : కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్.. కారణం ఏంటంటే
రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించవలసిందిగా రవాణాశాఖ మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్, కార్మిక శాఖ మంత్రి సివి గణేశన్‌లను ఆదేశించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
Also Read : Also Read : Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల కోడ్.. తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ డబ్బు, కిలోల కొద్దీ బంగారం
తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీల్లో తరచూ అగ్నిప్రమాదాలు, పేలుళ్లు జరుగుతున్నాయి. గత వారం కర్ణాటక – తమిళనాడు సరిహద్దులోని హోసూరు సమీపంలో గల అత్తిపల్లి బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.