నిర్భయ దోషుల ఉరిని లైవ్‌ లో చూపించాలి : సుప్రీంకోర్టులో PIL

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 02:24 AM IST
నిర్భయ దోషుల ఉరిని లైవ్‌ లో చూపించాలి : సుప్రీంకోర్టులో PIL

Updated On : December 14, 2019 / 2:24 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం సమీపిస్తోంది. వారి చావు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు తయారు చేయించారు. ప్రస్తుతం వాటిని తీహార్ జైలుకి పంపే పనిలో అధికారులు ఉన్నారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టులో నిర్భయ దోషుల ఉరి శిక్షపై ఓ పిల్ దాఖలైంది. నలుగురు నిందితులను వీలైనంత త్వరగా డెత్ వారంట్ జారీ చేసి నెల లోపే నలుగురు దోషులను ఉరితీయాలి. ఉరితీయడాన్ని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేసి దేశ ప్రజలందరికీ చూపించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

అమెరికా తరహాలో నిర్భయ తల్లిదండ్రులను తీహార్ జైలుకు తీసుకెళ్లి వారి ముందే దోషులను చంపేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఉరిశిక్షకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతమైనట్టు తెలుస్తోంది. కాగా.. నిర్భయ నిందితుల్లో అక్షయ్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను డిసెంబరు 17న విచారించనుంది కోర్టు.