Minister Nirmala Sitharaman: ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Minister Nirmala Sitharaman: ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

Updated On : December 29, 2022 / 3:45 PM IST

Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనారోగ్య సమస్య నుంచి కోలుకున్నారు. ఈనెల 26న మధ్యాహ్నం సమయంలో నిర్మలా సీతారామన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటాన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు. అయితే, ఆమె ఆరోగ్యంపై వైద్యులు ఎలాంటి వివరాలు బయటకు వెళ్లడించలేదు.

Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ప్రస్తుతం నిర్మల సీతారామన్ ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2023 సంవత్సరంలో పార్లమెంట్‌లో బడ్జెట్‍‌ను సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో అధికారులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Nirmala Sitharaman: సాంకేతికత ఉపయోగించి రూ.2,00,000 కోట్లు ఆదా చేశాం.. కేంద్ర ఆర్థిక మంత్రి

ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ముందు రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటల్ బీహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ లో ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు రోజు చెన్నైలోఓ మెడికల్ యూనివర్శిటీ 35వ వార్సికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.