ఫిబ్రవరి వరకు “నో బోర్డ్ ఎగ్జామ్స్”…కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

ఫిబ్రవరి వరకు “నో బోర్డ్ ఎగ్జామ్స్”…కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

Updated On : December 22, 2020 / 8:34 PM IST

No board exams in January or February మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో నిర్ణయిస్తామన్నారు.

అయితే, పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఇబ్బందులు వస్తాయని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉన్న విద్యావకాశాలకు సంబంధించి ఇబ్బందులు వస్తాయని అన్నారు.

అందుకే పరీక్షలను రద్దు చేయకుండా.. ఆ తరువాత నిర్వహిస్తామని అన్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ఫిబ్రవరి తరువాత నిర్ణయిస్తామని అన్నారు. దేశంలోని అనేక సీబీఎస్ఈ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్న నేపథ్యంలో… ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యంకాదని అన్నారు.

చాలా దేశాలు ఒక పూర్తి అకడమిక్ ఇయర్ ని రద్దు చేశాయని కానీ మన ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తూనే ఉన్నారని,ఏ ఒక్క విద్యార్థి తమ విద్యా సంవత్సరం వృద్ధా కాకుండా.. టీచర్లు బాగా కష్టపడుతున్నాకని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. టీచర్లు కూడా కరోనా వారియర్స్ అని తెలిపారు. ఈ కరోనా కష్టకాలంలో 33కోట్ల మంది విద్యార్థి,విద్యార్థినీలకు మన టీచర్లు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం(NEP)మరియు క్షేత్రస్థాయిలో దాని అమలులో టీచర్ ముఖ్యమైన కీ అని పోఖ్రియాల్ తెలిపారు.

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ లో టీచర్స్ యొక్క ట్రెయినింగ్ చాలా కష్టతరమైనదని పోఖ్రియాల్ అన్నారు. దీని కోసం “నిష్ఠా”వంటి పలు డిజిటల్ ఫ్లాట్ ఫాంలను తీసుకొచ్చినట్లు చెప్పారు. CBSE.. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టీచింగ్ లో 4.80లక్షల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. కరోనా కారణంగా విద్య అనేది ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంకి చేరిందన్నారు. పాఠశాలలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదని తెలిపారు.

6వ తరగతినుంచి పైబడిన విద్యార్థుల కోసం ఇంటర్నన్ షిప్ తో కూడిన వొకేషనల్ ట్రయినింగ్ ని తీసుకురానున్నట్లు పోఖ్రియాల్ చెప్పారు. జాతీయ విద్యా విధానం 2020 కింద దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.