No Fuel : ఆ వాహనాలకు నో పెట్రోల్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎందుకంటే..

ఢిల్లీలో ప్రస్తుతం అత్యధిక శాతం సీఎన్జీ బస్సులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ నాటికి 90శాతం సీఎన్జీ బస్సులను తొలగించి వాటి స్థానలో ఎలక్ట్రిక్ బస్సులను

No Fuel : ఆ వాహనాలకు నో పెట్రోల్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎందుకంటే..

Updated On : March 2, 2025 / 12:53 AM IST

No Fuel : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టింది. మార్చి 31 తర్వాత 15ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లకు పైబడిన వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల వద్ద గ్యాడ్జెట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వాటిలో పెట్రోల్, డీజిల్ పోసేందుకు నిరాకరిస్తారు.

అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మాగ్ గన్లను అమర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90 శాతం సీఎన్జీ బస్సులను దశల వారిగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీకి ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్య నివారణకు కీలక నిర్ణయాలను తీసుకుంది కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వ. కాలుష్య నివారణ చర్యలపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిస్రా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత వాహనాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలను తప్పనిసరి చేయడంతో పాటుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్న అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు డీజిల్, పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పెట్రోల్ బంకుల వద్ద ఒక ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

అలాగే ఢిల్లీలో ప్రస్తుతం అత్యధిక శాతం సీఎన్జీ బస్సులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ నాటికి 90శాతం సీఎన్జీ బస్సులను తొలగించి వాటి స్థానలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెబుతున్నారు.

Also Read : మార్చి నెలలో బ్యాంక్ హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని రోజులంటే..?

అలాగే కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడల్లా క్లౌడ్ సీడింగ్ (కృతిమ వర్షం కురిపించేందుకు) ను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని మంత్రి సిస్రా వెల్లడించారు. ఎన్నికల హామీల్లో ఢిల్లీ కాలుష్య నియంత్రణ ప్రధాన అంశంగా ఉంది. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంశాలపైన సమీక్షించి దానికి సంబంధించిన నిర్ణయాలను ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది.