Petrol, Diesel Prices : వరుసగా నాల్గో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా నాల్గో రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కొన్నిరోజుల పాటు స్థిరంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు వరుసగా ఇందన ధరలను పెంచుతూ పోతున్నాయి.

Petrol, Diesel Prices : వరుసగా నాల్గో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel Prices Rise For Fourth Consecutive Day

Updated On : May 7, 2021 / 11:47 AM IST

Petrol, Diesel Prices : చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా నాల్గో రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కొన్నిరోజుల పాటు స్థిరంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు వరుసగా ఇందన ధరలను పెంచుతూ పోతున్నాయి.

లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్ డీజిల్‌పై 31 పైసలు చొప్పన పెంచాలని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.91 దాటింది. గురువారం పెట్రోల్‌ ధర రూ.90.99గా నిర్ణయించారు.

తాజాగా పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ.91.27కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.42 నుంచి లీటర్‌కు రూ.81.73కి చేరింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.97.61కు పెరగగా.. డీజిల్‌ ధర రూ.88.82లకు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.68గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.11కు చేరింది.