జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్

సినీ నటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింద రాంపూర్ కోర్టు. జయప్రద రాజకీయ ప్రత్యర్థి అజం ఖాన్ కూడా మోసం కేసులో జైలులో ఉన్నాడు.
మాజీ ఎంపీ జయప్రద లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి టికెట్‌పై పోటీ చేశారు. ఈ సమయంలో ఆమెపై ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒకటి కేమ్రీ పోలీస్‌స్టేషన్‌లో నమోదు కాగా, రెండోది స్వార్ కొత్వాలిలో నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. కామ్రీలో దాఖలైన కేసులో కోర్టు కొద్ది రోజుల క్రితం కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అయితే స్వర్ కొట్వాలిలో దాఖలైన కేసులో జయప్రదపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అంతకుముందు రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జయప్రద ఎంపీగా గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీలో చేరిన జయప్రద ఆ పార్టీ అభ్యర్థినిగా ఎన్నికల బరిలోకి దిగి లక్ష ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.
See Also | మీరు చొక్కా విప్పితే స్టైల్ అంటారు.. మా చున్నీ జారితే రచ్చ రచ్చ చేస్తారు..