25 Paisa Coin : బంపర్ ఆఫర్.. ఈ 25పైసల కాయిన్ మీ దగ్గరుందా? అయితే మీరు లక్షాధికారే

మీ దగ్గర పాత కరెన్సీ నాణేలు ఉన్నాయి. వాటిలో పాత 25 పైసల కాయిన్ ఉందేమో చెక్ చేయండి? ఉంటే మాత్రం, మీరు నిజంగా అదృష్టవంతులే. లక్షాధికారి కావొచ్చు. ఏకంగా ఒకటిన్నర లక్ష వరకు గెలవొచ్చు. ఏంటి... నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండి బాబూ.

25 Paisa Coin : బంపర్ ఆఫర్.. ఈ 25పైసల కాయిన్ మీ దగ్గరుందా? అయితే మీరు లక్షాధికారే

25 Paisa Coin

Updated On : April 29, 2021 / 3:18 PM IST

25 Paisa Coin : మీ దగ్గర పాత కరెన్సీ నాణేలు ఉన్నాయి. వాటిలో పాత 25 పైసల కాయిన్ ఉందేమో చెక్ చేయండి? ఉంటే మాత్రం, మీరు నిజంగా అదృష్టవంతులే. లక్షాధికారి కావొచ్చు. ఏకంగా ఒకటిన్నర లక్ష వరకు గెలవొచ్చు. ఏంటి… నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండి బాబూ.



మీ దగ్గర స్పెషల్ ఓల్డ్ 25పైసల కాయిన్ ఉంటే దాన్ని ఫొటో తియ్యండి. ఆ ఫొటోని IndiaMART.com లో అప్ లోడ్ చేయండి. అందులో వేలం పాట జరుగుతుంది. మ్యాగ్జిమమ్ ఎవరు బిడ్ చేస్తారో వాళ్లకి ఈ కాయిన్ సొంతం అవుతుంది. కొనాలనుకున్న వారితో మీరు బేరసారాలు ఆడే అవకాశామూ ఉంది. కాగా, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. 25 పైసల కాయిన్ సిల్వర్ కలర్ లో ఉండాలి. అంతేకాదండోయ్… పాత 5, 10 పైసల కాయిన్స్ అమ్మి కూడా డబ్బు సంపాదించవచ్చు. వాటిని కూడా IndiaMART.com లో వేలానికి పెట్టొచ్చు.

Now Pocket Rs 1.5 Lakh If You Have Special 25 Paisa Coin



ఇండియా మార్ట్.. దేశంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్. 10 కోట్లకు పైనే బయ్యర్లు, 60 లక్షలకు పైనే సప్లయర్స్ ఉన్నారు. మీరు రిటైలర్ లేదా మ్యానుఫ్యాక్చరర్ అయితే.. ఆన్ లైన్ లో మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఇండియా మార్ట్ ఓ చక్కటి వేదిక. అంతేకాదు నమ్మకమైనది కూడా. 100 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఉత్పత్తులు కొనేందుకు అమ్మేందుకు వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియా మార్ట్ తన వెబ్ సైట్ లో తెలిపింది. మీరు మీ ఉత్పత్తిని ఇందులో అమ్మాలి అనుకుంటే, ముందుగా రిజిస్ట్రర్ కావాల్సి ఉంటుంది. కాంటాక్ట్ డీటైల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఉత్పత్తుల సమాచారం ఇవ్వాలి.