తమిళనాడులో ఈక్వాలిటీ : సగం సీట్లు మహిళలకే కేటాయించిన ఎన్డీకే

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 10:45 AM IST
తమిళనాడులో ఈక్వాలిటీ : సగం సీట్లు మహిళలకే కేటాయించిన ఎన్డీకే

Updated On : April 1, 2019 / 10:45 AM IST

తమిళనాడు : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా మహిళలు పోరాడుతునే ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ పార్టీ మహిళలకు 50 శాతం సీట్లు ఇచ్చి తాము మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పిస్తామని నిరూపించింది.  అదే నామ్ తమిళర్ కట్చి. 

 గతంలో శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడిన సినీ దర్శకుడు సీమాన్..నామ్  తమిళర్ కట్చి(ఎన్టీకే)పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. ఎన్టీకే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరి కలిపి మొత్తం 40 నియోజవర్గాల్లో పోటీ చేస్తోంది. అందులో 20 సీట్లను మహిళలకే కేటాయించారు సీమాన్.ఈ క్రమంలో ఎన్టీకే తరపున పోటీచేసే మహిళా అభ్యర్థులందరూ డిగ్రీ, మాస్టర్స్, సాఫ్ట్‌వేర్ సహా వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యావంతులే కావడం విశేషం. 

మహిళలకు ఎక్కడ సరైన గౌరవం దక్కుతుందో అక్కడే అభివృద్ది, మార్పు జరిగేందుకు అవకాశముంటుదని అందుకే తమ పార్టీ మహిళలపై తమకున్న చిత్తశుద్దిని నిరూపించేందుకు ఆచరణలో చూపామని సీమాన్ తెలిపారు.  ఎన్టీకే బాటలోనే మిగతా పార్టీలు మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీమాన్ పిలుపునిచ్చారు. 

మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకోవటమేగానీ సీట్లు ఇవ్వటం మాత్రం జరగటంలేదు. మహిళల డిమాండ్ మాత్రం రిజర్వేషన్ల విషయంలో కొనసాగుతునే ఉంది. తాజాగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు కలిపి మొత్తం 71 మంది మహిళలే పోటీలో నిలిచారు. ఇందులో టీడీపీ 20, వైసీపీ 15, జనసేన 15 చొప్పున మహిళలకు సీట్లు కేటాయించాయించిన విషయం తెలిసిందే.   ఎన్టీకే బాటలోనే మిగతా పార్టీలు మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన 
Read Also : మంటలు, మద్యం బాటిల్స్ తో క్షుద్రపూజల కలకలం