చలి చంపేస్తోందా : పోదాం మన తీహార్ జైలుకు

చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైల్ బాట పడుతున్నారు. వినటానికి ఇది వింతగా వున్నా ఇది అక్షర సత్యం.చలి..చలి..చలి..ఎముకలు కొరికేస్తున్న చలి నుండి తప్పించుకోవాలంటే తీహార్ జైలుకు వెళ్లాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి..కప్పుకోవటానికి దుప్పటున్నా చలి ఆగటంలేదు మరి..దారేంటని వెతికితే తీహార్ జైలు కనిపించిది వారి కంటికి. ఇంకేముంది చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైలుకు పోతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 11:19 AM IST
చలి చంపేస్తోందా : పోదాం మన తీహార్ జైలుకు

చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైల్ బాట పడుతున్నారు. వినటానికి ఇది వింతగా వున్నా ఇది అక్షర సత్యం.చలి..చలి..చలి..ఎముకలు కొరికేస్తున్న చలి నుండి తప్పించుకోవాలంటే తీహార్ జైలుకు వెళ్లాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి..కప్పుకోవటానికి దుప్పటున్నా చలి ఆగటంలేదు మరి..దారేంటని వెతికితే తీహార్ జైలు కనిపించిది వారి కంటికి. ఇంకేముంది చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైలుకు పోతున్నారు.

 ఢిల్లీ : చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైల్ బాట పడుతున్నారు. వినటానికి ఇది వింతగా వున్నా ఇది అక్షర సత్యం.చలి..చలి..చలి..ఎముకలు కొరికేస్తున్న చలి నుండి తప్పించుకోవాలంటే తీహార్ జైలుకు వెళ్లాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి..కప్పుకోవటానికి దుప్పటున్నా చలి ఆగటంలేదు మరి..దారేంటని వెతికితే తీహార్ జైలు కనిపించిది వారి కంటికి. ఇంకేముంది చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైలుబాట పట్టారు. ఉపాయం లేనివాడ్ని ఊరు నుండి తరిమేయాలన్నారు పెద్దలు..మరో సామెత వింటే..ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండంటుంది. తిండి కోసమే  కాదండీ..దేనికైనా ఉపాయం కావాల్సిందే. శీతాకాలం చలి చంపేస్తోంది. ఒక ఢిల్లీలో చలిని తట్టుకోవాలంటే ఒకపట్టాన సాధ్యం కాదు.చలి బాధ తప్పించుకోవడానికి జనం తీహార్ జైలు బాట పడుతున్నారు.

రాత్రివేళ ఎముకలు కొరికే చలిలో ఫుట్‌పాత్‌లపై నిద్రించే బదులు.. ఎంచక్కా తీహార్ జైల్లో నిద్రిస్తే బెటర్ కదా అని అక్కడివారు ఆలోచిస్తున్నారు. అయితే జైల్లోకి ఎంట్రీ ఊరికే ఉండదు కదా.. కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు, నేరాలు చేసి తీహార్ జైల్లోకి ఎంట్రీ సంపాదిస్తున్నారు. చలికాలం వెళ్లేదాకా.. జైల్లో ఉంటే బతికిపోతాంరా బాబూ అనుకుంటున్నారు. దీంతో తీహార్ జైల్లో ఇటీవల ఖైదీల సంఖ్య పెరిగిపోయింది. 10,027 మంది సామర్థ్యంతో ఉండే తిహార్‌ జైల్లో ప్రస్తుతం 16వేల మంది ఖైదీలు ఉన్నారు.

చలికాలంలో జైలుకొస్తున్న  ఖైదీల సంఖ్య పెరుగుతోందేంటి అని ఆలోచించి జైలు సిబ్బంది ఈ విషయంపై దృష్టి పెట్టారు. దీనికి చిన్న చిన్న నేరాలతో జైలుకొచ్చినవారిని అడగగా..ఈ విషయం తెలిసిందనీ జైలు సిబ్బంది చెబుతున్నారు. మరి ఉపాయం వుంటే ఎంతటి అపాయకరమైన పరిస్థితులనైనా తప్పించుకోవచ్చని తెలుసుగానీ…మరీ జైలు కెళ్లితే చలినుండి తప్పించుకునే వీరి ఉపాయం కాస్తంత డిఫరెంటే..