అవన్నీ పుకార్లే : ICU నుంచి నటి నస్రత్ డిశ్చార్జీ

  • Published By: sreehari ,Published On : November 19, 2019 / 08:49 AM IST
అవన్నీ పుకార్లే : ICU నుంచి నటి నస్రత్ డిశ్చార్జీ

Updated On : November 19, 2019 / 8:49 AM IST

పశ్చిమ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ నస్రత్ జహాన్‌ ఐసీయూ నుంచి డిశ్చార్చి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడిన నస్రత్.. ఆదివారం రాత్రి (నవంబర్ 17, 2019) అపోలో గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందిన ఆమె సోమవారం సాయంత్రం (నవంబర్ 18, 2019) ఆస్పత్రి  నుంచి డిశ్చార్జి అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నస్రత్ జహాన్ ఆస్పత్రిలో చేరడంతో ఆమె డ్రగ్స్ అధిక మొత్తంలో తీసుకున్నారంటూ పుకార్లు వ్యాపించాయి.  

ఈ వార్తలపై స్పందించిన జహాన్ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఆమెను ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పారు. వైద్యులంతా బృందంగా ఏర్పడి ఆమెకు చికిత్స అందించారు. ‘నస్రత్.. స్రృహలోకి వచ్చారు. ఆరోగం నిలకడగా ఉంది’ అని వైద్యులు తెలిపారు. మరో కొన్ని గంటల్లో డిశ్చార్జి చేస్తారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

నస్రత్ కు ఆస్త్మా సమస్య ఉంది. ఇన్ హేలర్ కూడా వాడుతున్నారు. కానీ, ఆదివారం ఒక్కసారిగా శ్వాస సమస్య అధికమైంది. ఇన్ హేలర్ వాడినప్పటికీ సమస్య తగ్గలేదు. ఇప్పుడు నస్రత్ పూర్తిగా కోలుకున్నారు’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

నస్రత్ మెడికల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు.. ఆమె మెడిసిన్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్టు నిర్ధారించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో సోమవారం సాయంత్రమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు.