మహానదిలో బయటపడ్డ 500ఏళ్ల నాటి ఆలయం

  • Published By: Subhan ,Published On : June 12, 2020 / 11:05 AM IST
మహానదిలో బయటపడ్డ 500ఏళ్ల నాటి ఆలయం

Updated On : June 12, 2020 / 11:05 AM IST

ఒడిశాలోని నయగరా జిల్లా వద్ద మహానదిలో పురాతన ఆలయం బయటపడింది. ఇది 500ఏళ్ల నాటి ఆలయంగా భావిస్తున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కు చెందిన ఆర్కియోలాజికల్ సర్వే టీం రీసెంట్ గా కటక్ నుంచి వచ్చే ఎగువ ప్రవాహం కింద ఆలయం ఉన్నట్లు గుర్తించించింది. నయగరా వద్దనున్న పద్మావతి గ్రామంలో బైదీశ్వర్ వద్ద నీటిలో ఉన్న ఆలయం కనిపించింది. 

60అడుగుల పొడవు ఉన్న ఆలయం 15లేదా 16వ శతాబ్దం నాటిదిగా అంచనా వేస్తున్నారు. దాని నిర్మాణంలో వాడిన డిజైన్ ను బట్టి మస్తక కళ అప్పట్లోనే వాడేవారని పైగా ఆలయ నిర్మాణానికి వాడిన మెటేరియల్ ఆ కాలం నాటిదేనని గుర్తించారు. ఆర్కియాలజిస్టులు దీపక్ కుమార్ నాయక్.. ’60అడుగుల ఎత్తైన ఆలయం గోపీనాథ్ స్వామిదిగా గుర్తించాం. విష్ణువు అవతారాల్లో ఇదొకటి. 15 లేదా 16శతాబ్దాల్లో దీనిని నిర్మించి ఉండొచ్చని’ చెప్పారు. 

ఈ ఆలయ నిర్మాణం జరిగిన ప్రాంతాన్ని శతపట్టణ అనే వారట. అంటే ఏడు గ్రామాలు కలిసిన పట్టణం అని అర్థం. 150ఏళ్ల క్రితం నది ప్రవాహ దిశ మార్చుకోవడంతో గ్రామం మొత్తం 19వ శతాబ్దానికి నీటిలో మునిగిపోయింది. పద్మావతి గ్రామంలోని స్థానికులు మాట్లాడుతూ.. ఈ గ్రామంలోని 22దేవాలయాలు కనుమరుగైపోయాయని అన్నింటి కంటే పొడవైనది కాబట్టి గోపీనాథ్ ఆలయం మాత్రమే చాలా కాలం కనపడుతూ ఉండేదని చెబుతున్నారు. 

స్థానికుడై రవీంద్ర రానా గతేడాది నాలుగైదు రోజులు ఆలయం కనిపించినట్లు చెబుతున్నారు. నీటి స్థాయిలో మార్పులు రావడంతో కొద్ది రోజులు కనిపించిదని చెప్పారు. దాని కంటే ముందు ఓ 11ఏళ్ల క్రితం ఆలయం ఇలా దర్శనమిచ్చిందన్నారు. సబ్ కలెట్ర్ లగ్నజిత్ రౌత్.. మహానది ప్రవాహం మధ్యలో పురాతన ఆలయం కనుగొన్న మాట వాస్తవమే. దర్శించుకునేందుకు గ్రామస్థులు నదిలోకి వెళ్లొద్దంటూ సూచిస్తున్నారు.