ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న బీజేపీ
Odisha assembly election 2024: ఈ సారి గెలిస్తే దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు ఆయనకు దక్కేది.

Naveen Patnaik
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మ్యాజిక్ ఈ సారి పనిచేయలేదు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ స్థాయి ప్రతిపక్ష నేత ఎవరూ లేకపోయినప్పటికీ బీజేడీ ఓటమి దిశగా పయనిస్తోంది. బీజేపీ సత్తా చాటింది. ఆ పార్టీ ఏకంగా 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఒడిశాలో మొత్తం 147 స్థానాలు ఉన్నాయి. అధికార బీజేడీ 48 సీట్లలో మాత్రమే ఆధిక్యం కనబర్చుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 15, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో గెలిచారు. నవీన్ పట్నాయక్ ఇప్పటికే ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సారి గెలిస్తే దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు ఆయనకు దక్కేది. ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ మార్కు 74ను ఇప్పటికే బీజీపీ దాటేసింది. కావాల్సిన మెజారిటీ కంటే ఐదు సీట్లు అధికంగానే వస్తున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని పార్టీగా ఉన్న బీజేడీకి ఈ సారి 50 సీట్లు కూడా రావడం లేదు.
ఒడిశా మంత్రుల్లో కొందరు వెనకంజలో ఉన్నారు. సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఓ స్థానంలో ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇక లోక్ సభ స్థానాల్లో బీజేపీ 19 నియోజక వర్గాల్లో ఆధిక్యంలో ఉంటే, బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిగతా ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబర్చుతోంది.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గంలో బీజేపీ గెలుపు