చంటిబిడ్డతో లొంగిపోయిన మహిళా నక్సల్

  • Published By: veegamteam ,Published On : November 8, 2019 / 06:25 AM IST
చంటిబిడ్డతో లొంగిపోయిన మహిళా నక్సల్

Updated On : November 8, 2019 / 6:25 AM IST

ఒడిశా లో ఓ మహిళా నక్సలైట్ తన చంటిబిడ్డతో సహా పోలీసుల ముందు లొంగిపోయింది. శుక్రవారం (నవంబర్ 8)న  రూ .1 లక్ష రివార్డు ఉన్న నక్సలైట్ మహిళ తన బిడ్డతో కలిసి రాయ్‌గడ్ పోలీసుల ముందు లొంగిపోయింది. దీంతో ఆమెను పోలీసులు అభినందించారు.

మెపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రూపాయల రివార్డును ఇస్తామని ఆమెకు..చిన్నారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యమాల పేరుతో అడవుల్లో ఉండే నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని..అటువంటి వారికి ప్రభుత్వం పునరావాలసాలు కల్పించి వారి జీవనానికి కావాల్సిన ఉపాధిని కల్పిస్తుందని పోలీస్ అధికారులు సూచించారు. 

ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమ సాహిత్యాలు చదివి ..ఇలా నక్సల్స్ గా మారిన ఎంతో మంది మహిళలు అడవుల్లో జీవితాలను గడుపుతున్నారు. ఆవేశంతోనే లేదా మరేదైనా ప్రభావాలతోనే లేదా ఒత్తిళ్లతోనే అడవిబాట పట్టిన వారు కొంతకాలం తరువాత సమాజం జీవితాన్ని కోరుకుంటుంటారు. వారి బిడ్డల భవిష్యత్తు అడవుల పాలు కాకూడదనే సహజమైన అమ్మ మనస్సుతో బిడ్డపై మమకారం..ఆ బిడ్డ భవిష్యత్తు పట్ల ఆశతోను ఇలా ఒడిలో చంటి బిడ్డలతో పోలీసుల మందు లొంగిపోతుంటారు.  ఈ క్రమంలో ఈ మహిళా నక్సలైట్ పోలీసుల ముందు లొంగిపోయింది.