Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!

ప్రి బుకింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది.

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!

Ola Electric

Updated On : September 19, 2021 / 7:05 PM IST

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా జరిగిన ప్రి బుకింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా అమ్మకాలు జరిపినట్లు ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Read More : Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ కోసం వెయిట్ చేస్తున్న రష్మిక..

రెండో దశ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు తిరిగి నవంబర్‌ 1 నుంచి ప్రారంభం అవుతోందని వెల్లడించారు. భారతీయ ఈవీ మార్కెట్లో ఎన్నో సంచాలనాల మధ్య విడుదలైన ఈ స్కూటర్ వాస్తవానికి సెప్టెంబర్ 8 నుంచి అమ్మకానికి రావాల్సి ఉంది. అనివార్యకారణాల వలన డెలివరీకి వచ్చే నెలకు వాయిదా వేసింది కంపెనీ.

Read More : Most Expensive Pet : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే!