Omicron Cases : ఒమిక్రాన్ ఫియర్.. ఢిల్లీ, ముంబైల్లో భారీగా పెరిగిన కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 415పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది.

Omicron Cases : ఒమిక్రాన్ ఫియర్.. ఢిల్లీ, ముంబైల్లో భారీగా పెరిగిన కేసులు

Omicron Cases

Updated On : December 26, 2021 / 8:00 AM IST

Omicron Cases : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 400పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. అత్యవసర విభాగాలకు ప్రికాషన్ డోస్ అందిస్తామని తెలిపింది. ఇక కేసుల పెరుగుదల తీరు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా రోజుల తర్వాత ముంబై, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. శ‌నివారం ఢిల్లీలో 38శాతం కేసులు పెర‌గ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి. ఢిల్లీలో శ‌నివారం 249 కొత్త కేసులు న‌మోద‌వ్వ‌గా, ముంబైలో 757 కేసులు వెలుగుచూశాయి. మరోవైపు మహారాష్ట్ర ఒమిక్రాన్ కేసుల సంఖ్య లో మొదటి స్థానంలో ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటం.. ఒమిక్రాన్‌ కేసులు అధికంగా ఉండటంతో.. ప్రభుత్వం ముంబైలో నైట్ క‌ర్ఫ్యూతో పాటు 144 సెక్ష‌న్ కూడా అమ‌లు అవుతున్న‌ది.

చదవండి : Telangana Omicron : తెలంగాణలో ఒమిక్రాన్, 41 కేసుల్లో కోలుకున్నది పది మంది

ఇక‌, ఢిల్లీలో క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై నిషేధం అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వం కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 1.5 కోట్లు వ‌సూలు చేసింది. అయితే ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేనివారికి కూడా ఈ మహమ్మారి సోకుంది. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్‌క‌తాకు చెందిన ఓ వైద్యుడికి ఎలాంటి వివేశీ ప్ర‌యాణాలు చేయ‌కున్నా ఒమిక్రాన్ సోకింది. దీంతో ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

చదవండి : Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు