మీకిది తెలుసా: ఉల్లికి బదులు ఇవి వాడొచ్చు

మీకిది తెలుసా: ఉల్లికి బదులు ఇవి వాడొచ్చు

Updated On : December 10, 2019 / 6:20 AM IST

ఉల్లిపాయలకు ప్రత్యామ్నాయం దొరకడం కష్టమే కానీ, ప్రయత్నిస్తే  అందుబాటు ధరలో ఉన్నవాటితోనే సాధించగలం అంటున్నారు పరిశోధకులు. కిలో రూ.200పెరిగిపోయిన ఉల్లి కంటే, ఉల్లి కాడలు, వెల్లుల్లి కాడలే బెటర్ అంటున్నారు. గార్నిష్ కోసం వాడే పదార్థాలతో ఉల్లిపాయ ప్లేవర్ తీసుకురావచ్చు అంటున్నారు. మళ్లీ దీనిలో ఓ చిక్కు ఉంది. 

చీవ్స్(ఉల్లి కాడల పైభాగం):
కూరకు ఎక్కువ రుచిని పొందాలనుకుంటే చిన్నచిన్న ముక్కలుగా లేదా కట్ చేసుకుని వాడాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఒకే జాతి నుంచి వచ్చినవే కాబట్టి వాటి కాడల్లో ఒకే రుచి ఉంటుంది. ఉడకబెట్టే బంగాళ దుంప కూర, ఆమ్లెట్స్, చేపలు, సముద్ర చేపలు వంటి వంటల్లో వాడగలం కానీ, వేడి మీద మాత్రం కాదు. అందుకని కూర దించే ముందు ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి.

Onion price rise

 

లీక్స్(ఉల్లి కాడల్లోని తెల్లని భాగం): 
ఉల్లికాడల చివరి భాగాన్ని అంటే తెల్లని భాగాన్ని వేపుడు కూరల్లో వాడుకోవచ్చు. వీటిని ఎక్కువగా పులుసులకు వాడతాం. కూర దగ్గరగా కావాలంటే వీటి ఉపయోగం తప్పనిసరి. 

Onion price rise

 

షాలొట్స్:
ఉల్లిపాయల్లానే ఉంటాయి కానీ, ఉల్లి కాదు. వెల్లుల్లి పాయ సైజులో ఉల్లిపాయ కంటే కాస్త తియ్యగా ఉంటాయి. వాటి ఫ్లేవర్ కూడా అలానే అనిపిస్తుంది. ఉల్లిపాయ వాడిన విధంగానే అన్ని కూరల్లోకి వీటిని వాడేసుకోవచ్చు. 

.

Onion price rise

 

గ్రీన్ ఆనియన్స్: 
ఉల్లి కాడలు, ఉల్లి కాడల చివరి భాగంగా కలిపి వాడితే సూపర్ టేస్ట్ ఉంటుంది. కాడలతో వండితే దగ్గరగా అయితే, గ్రీన్ ఆనియన్స్ తో వండితే కొంచెం పలచగా అనిపిస్తుంది. త్వరగా ఉడుకుతాయి కూడా. 

Onion price rise

 

ఎండబెట్టిన ఉల్లి పొరలు:
పచ్చి ఉల్లిపాయల కంటే ఎండబెట్టిన ఉల్లి వల్లనే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఎండబెట్టిన ఉల్లిపొడి ఒక తాజా ఉల్లిపాయతో సమానం. 
 

Onion price rise