Open Fire: పట్టపగలు షాప్ ఓనర్‌పై కాల్పులు

Open Fire: పట్టపగలు షాప్ ఓనర్‌పై కాల్పులు

Open Fire

Updated On : June 16, 2021 / 6:35 AM IST

Open Fire: రాజస్థాన్ లో వ్యాపారిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా వ్యాపారి తప్పించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా గుమన్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సబ్జీ మండి ప్రాంతంలో కైలాష్ మీనా అనే కమిషన్ వ్యాపారం చేస్తుంటాడు.

అక్కడ ఉండే దుకాణాలకు పండ్లు, కూరగాయలు సప్లై చేస్తుంటాడు. అయితే ఇతడిని హతమార్చేందుకు రెండు వాహనాలపై ఆరుగురు వ్యక్తులు వచ్చారు. మొదట ముగ్గురు వ్యక్తులు దుకాణం దగ్గరకు వెళ్లి కైలాష్ మీనాను పిలిచారు. దీంతో అతడు బయటకు వచ్చాడు.. ఈ సమయంలోనే ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గన్ తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.

దుండగుడి కాల్పుల నుంచి కైలాష్ మీనా తృటిలో తప్పించుకున్నాడు. కాల్పుల అనంతరం ఆరుగురు వ్యక్తులు రెండు బైక్ లపై పారిపోయారు. కాగా కాల్పులకు సంబదించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దుండగులు అక్కడినుంచి వెళ్ళగానే కైలాష్ మీనా పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణం తెలియరాలేదు.