Operation Sindoor: భారత్ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయింది- విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విక్రమ్ మిస్రీ ఆరోపించారు.

Operation Sindoor: భారత్ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయింది- విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

Updated On : May 9, 2025 / 11:18 PM IST

Operation Sindoor: పాకిస్తాన్ దాడులు, భారత్ ప్రతి చర్యలపై విదేశాంగ, రక్షణశాఖల అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారు. భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. కరాచీ లాహోర్ మధ్య విమానాలు తిరుగుతున్నాయన్నారు. అయితే, ఎయిర్ స్పేస్ మూసేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

అటు ఎల్ వోసీ వెంబడి నిరంతరం కాల్పులు జరుపుతోందన్నారు. ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాక్ అబద్దం చెబుతోందన్నారు విక్రమ్ మిస్రీ. పూంచ్ లోని స్కూల్ పై పాక్ దాడులు చేసిందని, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని వెల్లడించారు. గురుద్వారాలు, గుడులు, స్కూళ్లు లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోందన్నారు. మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విక్రమ్ మిస్రీ ఆరోపించారు. కర్తార్ పూర్ కారిడార్ మూసేశామని ఆయన తెలిపారు.

Also Read: టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు చేసింది.. అన్నింటిని కూల్చేశాం- కల్నల్ సోఫియా ఖురేషి

”బహవల్పూర్ ఐక్యరాజ్యసమితి నిషేధించిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం. దాని నాయకుడు మౌలానా మసూద్ అజార్ నిషేధిత వ్యక్తి. డేనియల్ పెర్ల్ మరణానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జైష్-ఎ-మొహమ్మద్ బాధ్యత వహించింది. కానీ నిజమైన సంబంధం అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ ద్వారా ఉంది. అతను భారత్ లో నిర్బంధించబడి 2000లో విడుదలయ్యాడు.

డేనియల్ పెర్ల్‌ను ప్రలోభపెట్టి చివరికి అతని హత్యకు దారితీసిన వ్యక్తి అతనే. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా అనుసంధానించబడిన వ్యక్తులు, అనుసంధానించబడిన సంస్థలు. భారత్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను పాకిస్తాన్ “హాస్యాస్పదంగా తిరస్కరించడం” దాని “ద్వంద్వత్వానికి” ఒక ఉదాహరణ. పాకిస్తాన్ ప్రయత్నాలకు భారత్ తగిన విధంగా స్పందించింది” అని మిస్రీ తెలిపారు.