హీటెక్కనున్న బడ్జెట్ సమావేశాలు : ‘సీఏఏ వద్దు’ సేవ్ ఇండియా నినాదాలతో ప్రతిపక్షాల నిరసన

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 06:10 AM IST
హీటెక్కనున్న బడ్జెట్ సమావేశాలు :  ‘సీఏఏ వద్దు’ సేవ్ ఇండియా నినాదాలతో ప్రతిపక్షాల నిరసన

Updated On : January 31, 2020 / 6:10 AM IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్న క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలు మరింత హీటెక్కనున్నాయి. 
మరి కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు-2020 ప్రారంభం కాబోతున్న సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇరు సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షాలు ఈ నిరసనలో పాల్గొని ‘సేవ్ ఇండియా’ నినాదాలు హోరెత్తించాయి. ‘సీఏఏ వద్దు’, ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అనే నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని విపక్ష నేతలు తమ నిరసన తెలిపారు.
 
సీఏఏను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశాయి. కానీ దీనిపై ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ బిల్లుపై విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని..ప్రజల్లో లేని పోని భయాందోళలను గురిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.  కాగా, తమ డిమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు పంజాబ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో సీఏఏ వ్యతిరేక తీర్మానాలను ఆమోదించిన విషయం తెలిసిందే.