విపక్ష నేతలు బయటికి రావాలి..రైతు నేత రాకేష్ టికాయత్

విపక్ష నేతలు బయటికి రావాలి..రైతు నేత రాకేష్ టికాయత్

Updated On : January 31, 2021 / 9:24 PM IST

Rakesh Tikait రైతులపై సానుభూతిగల ప్రతిపక్ష నాయకులు బయటికి రావాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. రైతులకు మరింత మద్దతు కావాలన్నారు. రైతు నిరసన వద్ద వాళ్లకి(విపక్షాలకు) ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం(జనవరి-31,2021) రైతు నిరసన సభలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావాలని టికాయత్ పిలుపునిచ్చారు. సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా టికాయత్ సృష్టం చేశారు. తాము ప్రభుత్వంతో మేము చర్చలు చేస్తామన్నారు. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించవచ్చని టికాయత్ పేర్కొన్నారు.

మరోవైపు, రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో విధ్వంసం తర్వాత ఢిల్లీ సిటీతో పాటు దేశరాజధాని సరిహద్దులో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 27, 28 తేదీల్లో సరిహద్దు వదిలి ఇంటికి వెళ్లిన రైతులు 28 అర్థరాత్రి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ చేరిక ఇప్పుడు హర్యానా, యూపీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో పెరుగుతోంది. జై జవాన్, జై కిసాన్ అంటూ నిరసనలోకి వస్తున్నారు. అయితే ప్రస్తుతం నిరసనకు వస్తున్న వారిలో యువ రైతులు, యువకులు ఎక్కువగా ఉన్నారు. రైతు నాయకుడు టికాయత్ కన్నీళ్లు చూసి హృదయం చలించిందని అందుకే నిరసనకు తిరిగి వచ్చామని వాళ్లు చెబుతున్నారు.