Orange Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరంజ్ అలర్ట్ జారీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని అదికారులు చెప్పారు....

Orange Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరంజ్ అలర్ట్ జారీ

Heavy Rain

IMD Orange Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని అదికారులు చెప్పారు. భారీవర్షాల నేపథ్యంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.

ALSO READ : Indian Air Force : భారత వైమానిక దళం యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10వేల కోట్లు…రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

బుధవారం భారీ వర్ష సూచన కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ బుధవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికుల గోస

బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట,తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాక అధికారులు వివరించారు.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికం

తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.