Heavy Rain Alert : పలు జిల్లాల్లో భారీవర్షాలు.. ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో భారత వాతావరణశాఖ మంగళవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు....

Heavy Rain Alert : పలు జిల్లాల్లో భారీవర్షాలు.. ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ

Heavy Rain Alert

Updated On : November 14, 2023 / 10:33 AM IST

Heavy Rain Alert : తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో భారత వాతావరణశాఖ మంగళవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. విల్లుపురం, అరియాలూర్, కడలూర్, నాగపట్టిణం, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ALSO READ : Virat Kohli : నా కూతురు వామిక ఫొటోలు తీయొద్దు.. ఫొటోగ్రాఫర్లకు విరాట్ కోహ్లీ ప్రత్యేక అభ్యర్థన

తమిళనాడు రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీవర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని భారత వాతావరణశాఖ సూచించింది. భారీవర్షాల వల్ల పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.