Virat Kohli : నా కూతురు వామిక ఫొటోలు తీయొద్దు.. ఫొటోగ్రాఫర్లకు విరాట్ కోహ్లీ ప్రత్యేక అభ్యర్థన

న్యూజిలాండ్ జట్టుపై లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ దంపతులు తన గారాలపట్టి వామికతో కలిసి బెంగళూరు నుంచి ముంబయికు వచ్చారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి సోమవారం బెంగళూరు నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నపుడు వారిని ఫొటోగ్రాఫర్లకు క్లిక్ మనిపిస్తున్నారు.....

Virat Kohli : నా కూతురు వామిక ఫొటోలు తీయొద్దు.. ఫొటోగ్రాఫర్లకు విరాట్ కోహ్లీ ప్రత్యేక అభ్యర్థన

Virat Kohli

Virat Kohli : న్యూజిలాండ్ జట్టుపై లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ దంపతులు తన గారాలపట్టి వామికతో కలిసి బెంగళూరు నుంచి ముంబయికు వచ్చారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి సోమవారం బెంగళూరు నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నపుడు వారిని ఫొటోగ్రాఫర్లకు క్లిక్ మనిపిస్తున్నారు. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న కోహ్లి తన కుమార్తె వామిక చిత్రాలను క్లిక్ చేయవద్దని విమానాశ్రయంలోని ఫోటోగ్రాఫర్లను కోరారు.

ALSO READ : Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

కోహ్లీ, అతని బాలీవుడ్ స్టార్, భార్య అనుష్క శర్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా నుంచి వీలైనంత వరకు వామిక ఫొటోలు తీయకుండా ప్రయత్నం చేశారు. ముంబయి విమానాశ్రయంలో మాస్క్ ధరించి బయటకు వచ్చిన కోహ్లి తన కారు వైపు వెళ్లే ముందు అభిమానులు, ఫోటోగ్రాఫర్ల కోసం కొన్ని ఫోటోలు దిగారు. ‘‘అరే యార్ బేటీకో ఘర్ లేకే జానా హై’’ (నేను నా కూతురిని ఇంటికి తీసుకెళ్లాలి) అని కోహ్లి ఫొటోగ్రాఫర్లకు చెప్పారు.

ALSO READ : Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023లో లీగ్ దశల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. భారత మాజీ కెప్టెన్ 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 99 సగటుతో 594 పరుగులు చేశారు. బుధవారం జరిగే తొలి సెమీ-ఫైనల్‌లో భారత బ్యాటర్ 50 వన్డే సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా అవతరించాలని చూస్తున్నాki. నాలుగేళ్ల క్రితం ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. అయితే ఈసారి కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడనున్నారు.