Orissa High Court : లైంగిక సాన్నిహిత్యం రేప్ కాదు.. ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు
ఇలాంటి కేసుల్లో సదరు పురుషుడు మహిళపై లైంగిక దాడి చేశాడని ఆరోపించలేమని పేర్కొంది. లైంగిక సాన్నిహిత్యాన్ని ఎల్లప్పుడూ లైంగిక దాడిగా పరిగణించకూడదని వెల్లడించింది.

Orissa High Court
High Court Judgment : ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగిక సాన్నిహిత్య రేప్ గా పరిగణించలేమని స్పష్టం చేసింది. నిజాయితీ గల స్నేహంతో మొదలైన ఒక బంధం కొన్నేళ్ల తర్వాత చేదుగా మారి ఆ బంధంలోని పురుషుడు మహిళను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే ఇంతకాలం సాగిన వారి లైంగిక సాన్నిహిత్యాన్ని మోసపూరితమైందిగా భావించరాదని తెలిపింది. ఈ మేరకు ఒరిస్సా హైకోర్టు జులై3న చారిత్రాక తీర్పు ఇచ్చింది.
ఇలాంటి కేసుల్లో సదరు పురుషుడు మహిళపై లైంగిక దాడి చేశాడని ఆరోపించలేమని పేర్కొంది. లైంగిక సాన్నిహిత్యాన్ని ఎల్లప్పుడూ లైంగిక దాడిగా పరిగణించకూడదని వెల్లడించింది. మొదట్లో కొన్ని కారణాల వల్ల అతడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని, కానీ చివరికి అందుకు సిద్ధంగా లేడని తెలిపారు.
Richest Cricketers : దేశంలో అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరంటే…
అయితే బ్లాక్ మెయిల్ చేయడంతో అతడు పెళ్లికి అంగీకరించాడని, కానీ ఆశ్చర్యంగా 2021లో ఆమె అతడితో ఒక ఒప్పందం చేసుకుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సంబంధాన్ని కొనసాగించడంలో ఇద్దరూ కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. బంధాన్ని సాగించడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం తెలిసీ కూడా వారిద్దరూ తమ సంబంధాన్ని కొనసాగించారని చెప్పారు.