Mumbai airport: 2018లో సాధించిన రికార్డును బద్దలు కొట్టనున్న ముంబై విమానాశ్రయం

అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ఈ వేసవి కాలంలో ఏదైనా ఒక రోజు 24 గంటల్లో 1,000కి పైగా విమాన, రాకపోకలు జరిగే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయంలో 2018, జులై 7న 24 గంటల వ్యవధిలో 1,003 విమానాల రాకపోకలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రికార్డు బద్దలు కాలేదు.

Mumbai airport: 2018లో సాధించిన రికార్డును బద్దలు కొట్టనున్న ముంబై విమానాశ్రయం

Mumbai airport

Updated On : March 14, 2023 / 12:55 PM IST

Mumbai airport: అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ఈ వేసవి కాలంలో ఏదైనా ఒక రోజు 24 గంటల్లో 1,000కి పైగా విమాన, రాకపోకలు జరిగే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయంలో 2018, జులై 7న 24 గంటల వ్యవధిలో 1,003 విమానాల రాకపోకలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రికార్డు బద్దలు కాలేదు. మళ్లీ ఈ ఏడాది అంత రద్దీ కనపడే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే, గత నెల 11న ఈ విమానాశ్రయంలో 974 విమానాల రాకపోకలు జరిగాయి. కరోనా అనంతరం ఒక్క రోజులో ఇన్ని విమానాల రాకపోకలు జరగడం ఇదే తొలిసారని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముంబై ఎయిర్ పోర్టులో గత నెల మొత్తం కలిపి 24,292 విమానాల రాకపోకలు జరిగాయి. 2022, ఫిబ్రవరితో పోల్చితే గత నెల విమానాల రాకపోకల్లో 57 శాతం వృద్ధి కనపడింది.

వేసవికాల షెడ్యూల్ ప్రారంభమైందని, మరోసారి ఒక్కరోజులో విమాన, రాకపోకలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ 24 గంటల వ్యవధిలో 1,000 విమానాల రాకపోకలు జరగనున్నాయని తెలిపారు. సింగిల్-రన్ వే ఆపరేషన్లలో లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టుతో పాటు ముంబై విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్టుగా ప్రసిద్ధి.

కరోనా అనంతరం ముంబై విమానాశ్రయంలో విమానరాకపోకలు పెరిగాయి. 2022 మార్చిలో రోజుకి సగటున 750 విమానాల రాకపోకలు జరిగాయి. ఆ తర్వాత వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రోజుకి సగటున 950 విమానాల రాకపోకలు జరుగుతున్నాయి.

Joe Biden Viral Video : బ్యాంకుల సంక్షోభం గురించి ప్రశ్నించిన మీడియా..సమాధానం చెప్పకుండా వేరే రూమ్‌లోకెళ్లి డోర్ వేసేసుకున్న బైడెన్